ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం
జటాఝూటగంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే
ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం
అనాదిహ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమీశానమీడే
వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశం
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే
గిరీంద్రాత్మజాసంగాహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దధానం
బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే
శరచ్చంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే
హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే
ఫల శృతి
స్తవం యః ప్రభాతే నరః శూలపాణే పఠేత్ సర్వదా భర్గ భావానురక్తః
సుపుత్రం ధనం ధాన్య మిత్రం కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షం ప్రయాతి
తాత్పర్యము:
ప్రభువు, మా ప్రాణ నాథుడు, జగత్పతి, విశ్వనాథుడు, జగన్నాథుడు అయిన విష్ణువునకు నాథుడు, ఎల్లప్పుడూ ఆనందంలో అలరు వాడు, జగమంతటికి ప్రకాశాన్ని కలిగించే వాడు, జీవులకు, భూతములకు, అన్నిటికి నాథుడయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.
మెడలో కపాలములు ధరించిన వాడు, శరీరము అంతా సర్పములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, గణేశునికి అధిపతి, గంగానదీ ప్రవాహము ధరించుట వలన విశాలమైన జటా ఝూటములు కలిగిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.
ప్రపంచానికి ఆనందం పంచే వాడు, అంతటా ఉన్నవాడు, సర్వము తనే అయిన వాడు, భస్మము శరీరమంతా కలిగిన వాడు, ఆది లేని వాడు, కొలత లేని వాడు, మహా మోహములను సంహరించే వాడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.
వట వృక్షము (మర్రి చెట్టు) క్రింద నివసించేవాడు, అట్టహాసంగా నవ్వేవాడు, మహా పాపములను నాశనము చేసే వాడు, ఎల్లప్పుడూ ప్రకాశించే వాడు, హిమవత్పర్వతాలకు అధిపతి, గణ నాయకుడు, దేవతలకు అధిపతి, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.
అర్థ దేహమున పార్వతిని కలిగిన వాడు, కైలాసమున నివసించువాడు, ఆర్తుల రక్షకుడు, ఆత్మ యైన వాడు, బ్రహ్మచే కొలువబడిన వాడు, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.
కపాలము, త్రిశూలం చేతులలో ధరించిన వాడు, పాదపద్మములను ఆశ్రయించిన వారి కోర్కెలు తీర్చే వాడు, నందిని అధిరోహించే వాడు, దేవతలకు, గణములకు అధిపతి, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.
శరత్కాలములో చంద్రుని వంటి ముఖము కలవాడు, గణములకు సంతోషాన్ని ఇచ్చే వాడు, మూడు నేత్రములు కలవాడు, స్వచ్చమైన వాడు, కుబేరుని స్నేహితుడు, పార్వతికి భర్త, ఎల్లప్పుడూ సచ్చరిత్ర కలిగిన వాడు, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.
హరుడు, సర్పములు హారములుగా కలవాడు, శ్మశానంలో తిరిగే వాడు, ప్రపంచమైన వాడు, వేదాల సారమైన వాడు, భేద భావము, వికారము లేని వాడు, శ్మశానములో నివసించే వాడు, మనసులో పుట్టిన కోరికను దహించే వాడు (మన్మథుని దహించిన వాడు అని కూడా అర్థం), అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.
ఫల శృతి:
ఆర్తితో, శరణాగతితో, భక్తితో ఈ స్తోత్రముతో శూలపాణిని స్తుతించిన వారికి మంచి భార్య, సంతానము, ధనము, ధాన్యము, విశేషమైన జీవనము కలిగి పిమ్మట శివ సాయుజ్యము కలుగును.