ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తికశోభినాసం
ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశం
ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం
మాణిక్య హేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షు చాపకుసుమేషు సృణీఃదధానాం
ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం
పద్మాసనాది సురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శనలాంఛనాఢ్యం

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవధ్యాం
విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతిదూరాం
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి
ఫలశృతి
యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిం
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిం
తాత్పర్యము:
వికిసించిన కలువ వంటి ముఖము, ఎర్రని పెదవులు, మెరిసే ముత్యం వలె ప్రకాశిస్తున్న ముక్కు, చెవుల వరకు విప్పారిన కన్నులు, మణిమయమైన చెవి ఆభరణాలు, చక్కని చిరునవ్వు, మెరిసే, వెడల్పైన నుదురు కలిగిన ఆ లలిత దేవిని ఉదయము స్మరిస్తున్నాను.
వరాలను ప్రసాదించే తీగల వంటి చేతులు కలిగిన, రత్నాలు పొదిగిన ఉంగరము, రాళ్ళు పొదిగిన బంగారు గాజులు ధరించిన, పుష్పాలతో అలంకరించ బడిన ధనుస్సు, పాశాంకుశము అలంకారములుగా కలిగిన ఆ లలితా దేవిని ఉదయము భజిస్తున్నాను.
భక్తుల కోరికలూ తీర్చే, సంసార సాగరాన్ని దాటించే నావయైన, బ్రహ్మాది దేవతలచే పూజించబడే, పాశాంకుశము, ధ్వజము, చక్రము మొదలగు అలంకారములు కలిగిన లలితా దేవి పాదపద్మములను ఉదయము పూజిస్తున్నాను.
పరమశివుని శక్తియై, దుష్టుల మదాన్ని అణచే, వేదాలు మరియు ఉపనిషత్తులచే వర్ణించబడి, శుద్ధయై, శుభయై, కరుణ కురిపించే, సృష్టి, స్థితి, లయలకు కారణయై, జగత్తుకే రాణిగా, మనస్సుకు, మాటలకు అందని లలితాదేవిని ఉదయము స్తుతిస్తున్నాను.
కామేశ్వరి, కమల, మహేశ్వరి, శాంభవి మొదలు ఎన్నో పుణ్య నామములు కలిగిన, జగజ్జని యైన, పదములు, భాషకు మూలమైన, త్రిపురేశ్వరిగా ఉన్న లలితా దేవి నామములను ఉదయము ఉచ్చరిస్తున్నాను.
ఫలశృతి:
సులభంగా ప్రసన్నమయ్యే లలితాదేవిని ఉదయము ఈ ఐదు శ్లోకాలతో స్తుతించిన వారికి విద్య, శుభము, సుఖము, అనంతమైన కీర్తి కలుగుతాయి.