Saturday, 19 March 2011

అష్టలక్ష్మీ స్తోత్రములు



1.ఆదిలక్ష్మి

సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే!
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమాం ||

2.ధాన్యలక్ష్మి

అయికలి కల్మష నాశిని కామిని వ్తెదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమాం ||

3.ద్తెర్యలక్ష్మీ

జయవరవర్ణిని వ్తెష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే !
భవభయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ద్తెర్యలక్ష్మి జయ పాలయమాం ||

4.గజలక్ష్మి

జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారక పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని శ్రీగజలక్ష్మి జయ పాలయమాం ||

5.సంతానలక్ష్మి

అయి గజవాహిని మోహిని చక్రిణి రాగవివర్దిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహిత్తెషిణి సప్తస్వర మయ గాననుతే
మనుజ సురాసుర దేవమునీశ్వర మానస వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి జయ పాలయమాం ||

6.విజయలక్ష్మి

జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసుర భూషిత వాసిత వాద్య నుతే
వసుధారాస్తుతి వ్తెభవ వందిత శంకర దేశిక మాన్య పదే
జయ జయహే మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయమాం ||

7.విద్యాలక్ష్మి

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామితఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయమాం ||

8.ధనలక్ష్మి

ధిమిధిమి ధింధిమి ధింధిమి ధిమిధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ
శంఖనినాద సువాద్య నుతే ! వేదపూరాణేతిహాస సుపూజిత
వ్తెదికమార్గ ప్రదర్శయుతే జయ జయహే మధుసూదన కామిని శ్రీధనలక్ష్మి జయ పాలయమాం ||