Monday, 21 March 2011

చంద్రశేఖరాష్టకం


చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం
శింజినీ కృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

పంచపాదప పుష్పగంధి పదాంబుజద్వయ శోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధమన్మథ విగ్రహం
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం
దేవసింధు తరంగశీకర సిక్తశుభ్ర జటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం
క్ష్వేడనీలగళం పరశ్వధధారిణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరం
అంధకాంతకామాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం
భుక్తిముక్త ఫలప్రదం సకలాఘ సంఘనివర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయమనుత్తమం 
సోమవారిణ  భూహుతాశన సోమపానిలఖాకృతిం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినం
క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమన్వితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


ఫలశ్రుతి

మృత్యుభీత మృకండ సూను కృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్
పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః


తాత్పర్యము:  

రత్నముల సమూహముచే చేయబడిన ధనుస్సును ధరించిన, వెండికొండ పై నివసించే, వాసుకిని తాడుగా కలిగి, విష్ణువును బాణములుగా కలిగి, త్రిపురములను నాశనము చేసిన, మూడు జగములచే పూజించబడిన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

సుగంధభరితమైన ఐదు కల్పక వృక్షముల పుష్పములతో పూజించబడే పాదములతో, తన మూడవ నేత్రము యందలి అగ్నితో మన్మథుని దగ్ధము చేసిన, భస్మమును దేహమంతా కలిగిన, నా పాపములను నాశనము చేసే, నాశనములేని, చంద్రుని ధరించిన శివుని పాహి అన్నాను,  ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

తాను ధరించిన ఏనుగు చర్మముతో చేసిన ఉత్తరీయముతో  ముగ్ధులను చేసే, పద్మముల వంటి పాదములు కలిగి, బ్రహ్మ విష్ణువులచే  పూజింపబడే, గంగా తరంగములతో తడిసిన జటా ఝూటం కలిగిన,  చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

యక్షరాజైన కుబేరుని స్నేహితుడు, భగుని నేత్రములు నాశనము చేసిన, సర్పములను ఆభరణంగా కలిగిన, వామ భాగమున పార్వతీదేవి ఉన్న శరీరము కలిగిన, గరళం కంఠంలో ధరించిన, గొడ్డలి ఆయుధంగా కలిగి, జింక చర్మము ధరించిన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

మెలికలు తిరిగిన సర్పములు కర్ణ కుండలములుగా ధరించిన, నారదుడు మొదలగు మునులచే నుతించబడిన, లోక పాలకుడైన, అంతకుడనే రాక్షసుని సంహరించిన,  భక్తులపాలిట కల్పవృక్షమై, యముని అణచిన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

భవ రోగములను బాపే వైద్యుడై, సకల అశుభములను, ఆపదలను తొలగించే వాడైన, దక్షుని యజ్ఞమును నాశనము చేసిన, మూడు గుణములు, మూడు నేత్రములు కలిగిన, భక్తి, ముక్తి ప్రసాదించి, సర్వ పాపములను నాశనము చేసే చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

భక్తవత్సలుడిగా పూజించబడి, నాశనము లేని సంపద యైన వాడు, దిక్కులే అంబరముగా కలవాడు, భూత నాథుడైన, పరాత్పరుడైన, నిర్వచనానికి అందని, అన్నిటికన్నా ఉత్తమమైన, పంచభూతములచే సేవించబడే, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

సృష్టి, స్థితి, ప్రళయ కారకుడై, ప్రతి ప్రాణిలో ఉండేవాడు, ప్రాణులతో నిరంతరం క్రీడలో ఉండేవాడు, గణ నాథుడై,  గణములో ఒకడైన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

ఫలశృతి: 

భీతావహుడైన మార్కండేయుడు (మృకండ మహర్షి కుమారుడు) రచించిన ఈ స్తోత్రము శివుని సన్నిధిలో పఠించిన వారికి మృత్యు భయము తొలగి, ధన ధాన్యములతో పూర్ణ ఆయుష్షు కలుగును. చివరకు శివుడు వారికి మోక్షము ప్రసాదించును.