Monday 21 March 2011

శ్రీ రుద్రదేవతా రూపం - శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు,

 రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.


 తత్పురుష ముఖ ధ్యానమ్

సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా  - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)

అఘోర ముఖ ధ్యానమ్

కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం

తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

సద్యోజాత ముఖ ధ్యానమ్

ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః
వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం

తాత్పర్యము:  హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)

వామదేవ ముఖ ధ్యానమ్

గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం
భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం
వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం

తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)

ఈశాన ముఖ ధ్యానమ్

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం


తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)


శ్రీరుద్రధ్యానమ్

బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం



తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!

ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్



తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి,  నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను. 

చమకమ్


చమకప్రశ్నః 

అథ ప్రథమోఽనువాకః
 
అగ్నావిష్ణూ సజోషసేమా వర్ధన్తు వాం గిరః
ద్యుమ్నైర్వాజేభిరాగతం
వాజశ్చ మే ప్రసవశ్చ మే
ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే
స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే
జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మేఽపానశ్చ మే
వ్యానశ్చ మేఽసుశ్చ మే చిత్తం చ మ ఆధీతం చ మే
వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే
బలం చ మ ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ మే
జరా చ మ ఆత్మా చ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ మే
ఽంగాని చ మేఽస్థాని చ మే పరూషి చ మే
శరీరాణి చ మే  ౧

ఇతి ప్రథమోఽనువాకః

అథ ద్వితీయోనువాకః

జ్యైష్ఠ్యం చ మ ఆధిపథ్యం చ మే మన్యుశ్చ మే
భామశ్చ మేఽమశ్చ మేఽమ్భశ్చ మే జేమా చ మే మహిమా చ మే
వరిమా చ మే ప్రథిమా చ మే వర్ష్మా చ మే ద్రాఘుయా చ మే
వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే
జగచ్చ మే ధనం చ మే వశశ్చ మే త్విషిశ్చ మే క్రీడా చ మే
మోదశ్చ మే జాతం చ మే జనిష్యమాణం చ మే సూక్తం చ మే
సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే
భవిష్యచ్చ మే సుగం చ మే సుపథం చ మ ఋద్ధం చ మ ఋద్ధిశ్చ మే
క్లుప్తం చ మే క్లుప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే  ౨

ఇతి ద్వితీయోనువాకః

అథ తృతీయోనువాకః

శం చ మే మయశ్చ మే ప్రియం చ మేఽనుకామశ్చ మే
కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే
వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే
యన్తా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే
విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే
సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం చ మే లయశ్చ మ ఋతం చ మే
ఽమృతం చ మేఽయక్ష్మం చ మేఽనామయచ్చ మే జీవాతుశ్చ మే
దీర్ఘాయుత్వం చ మేఽనమిత్రం చ మేఽభయం చ మే సుగం చ మే
శయనం చ మే సూషా చ మే సుదినం చ మే  ౩

ఇతి తృతీయోనువాకః

అథ చతుర్థోఽనువాకః 

ఊర్క్చ మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే
ఘృతం చ మే మధు చ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే
కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మ ఔద్భిద్యం చ మే
రయిశ్చ మే రాయశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే
విభు చ మే ప్రభు చ మే బహు చ మే భూయశ్చ మే
పూర్ణం చ మే పూర్ణతరం చ మేఽక్షితిశ్చ మే కూయవాశ్చ మే
ఽన్నం చ మేఽక్షుచ్చ మే వ్రీహియశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే
తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే
మసురాశ్చ మే ప్రియంగవశ్చ మేఽణవశ్చ మే
శ్యామాకాశ్చ మే నీవారాశ్చ మే  ౪

ఇతి చతుర్థోఽనువాకః

అథ పంచమోఽనువాకః  

అశ్మా చ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే
సికతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మే
ఽయశ్చ మే సీసం చ మే త్రపుశ్చ మే శ్యామం చ మే
లోహం చ మేఽగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ
ఓషధయశ్చ మే కృష్టపచ్యం చ మేఽకృష్టపచ్యం చ మే
గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పన్తాం
విత్తం చ మే విత్తిశ్చ మే భూతం చ మే భూతిశ్చ మే
వసు చ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మే
ఽర్థశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే  ౫

ఇతి పంచమోఽనువాకః  

అథ షష్ఠోఽనువాకః

అగ్నిశ్చ మ ఇన్ద్రశ్చ మే సోమశ్చ మ ఇన్ద్రశ్చ మే
సవితా చ మ ఇన్ద్రశ్చ మే సరస్వతీ చ మ ఇన్ద్రశ్చ మే
పూషా చ మ ఇన్ద్రశ్చ మే బృహస్పతిశ్చ మ ఇన్ద్రశ్చ మే
మిత్రశ్చ మ ఇన్ద్రశ్చ మే వరుణశ్చ మ ఇన్ద్రశ్చ మే
త్వష్టా చ మ ఇన్ద్రశ్చ మే ధాతా చ మ ఇన్ద్రశ్చ మే
విష్ణుశ్చ మ ఇన్ద్రశ్చ మేఽశ్వినౌ  చ మ ఇన్ద్రశ్చ మే
మరుతశ్చ  మ ఇన్ద్రశ్చ మే విశ్వే చ  మే దేవా ఇన్ద్రశ్చ మే
పృథివీ చ  మ ఇన్ద్రశ్చ మేఽన్తరీక్షం చ  మ ఇన్ద్రశ్చ మే
ద్యౌశ్చ మ ఇన్ద్రశ్చ మే దిశశ్చ మ ఇన్ద్రశ్చ మే
మూర్ధా చ మ ఇన్ద్రశ్చ మే ప్రజాపతిశ్చ మ ఇన్ద్రశ్చ మే  ౬

ఇతి షష్ఠోఽనువాకః

అథ సప్తమోఽనువాకః

అశుశ్చ మే రశ్మిశ్చ మేఽదాభ్యశ్చ మేఽధిపతిశ్చ మ
ఉపాశుశ్చ మేఽన్తర్యామశ్చ మ ఐన్ద్రవాయశ్చ మే
మైత్రావరుణశ్చ మ ఆశ్వినశ్చ మే ప్రతిపస్థానశ్చ మే
శుక్రశ్చ మే మన్థీ చ మ ఆగ్రయణశ్చ మే వైశ్వదేవశ్చ మే
ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మ ఋతుగ్రాహాశ్చ మే
ఽతిగ్రాహ్యాశ్చ మ ఐన్ద్రాగ్నశ్చ మే వైశ్వదేవాశ్చ మే
మరుత్వతీయాశ్చ మే మాహేన్ద్రశ్చ మ ఆదిత్యశ్చ మే
సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పౌష్ణశ్చ మే
పాత్నీవతశ్చ మే హారియోజనశ్చ మే  ౭

ఇతి సప్తమోఽనువాకః

అథ అష్టమోఽనువాకః

ఇధ్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే ధిష్ణియాశ్చ మే
స్రుచశ్చ మే చమసాశ్చ మే గ్రావాణశ్చ మే స్వరవశ్చ మ
ఉపరవాశ్చ మే అధిషవణే చ మే ద్రోణకలశశ్చ మే
వాయవ్యాని చ మే పూతభృచ్చ మే ఆధవనీయశ్చ మ
ఆగ్నీధ్రం చ మే హవిర్ధానం చ మే గృహాశ్చ మే సదశ్చ మే
పురోడాశాశ్చ మే పచతాశ్చ మేఽవభృథశ్చ మే
స్వగాకారశ్చ మే  ౮

ఇతి అష్టమోఽనువాకః

అథ నవమోఽనువాకః
 
అగ్నిశ్చ మే ధర్మశ్చ మేఽర్కశ్చ మే సూర్యశ్చ మే
ప్రాణశ్చ మేఽశ్వమేధశ్చ మే పృథివీ చ మేఽ దితిశ్చ మే
దితిశ్చ మే ద్యౌశ్చ మే  శక్క్వరీరంగులయో దిశశ్చ మే
యజ్ఞేన కల్పన్తామృక్చ మే సామ చ మే స్తోమశ్చ మే
యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మ ఋతుశ్చ మే వ్రతం చ మే
ఽహోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథన్తరే చ మే యజ్ఞేన కల్పేతాం  ౯

ఇతి నవమోఽనువాకః

అథ దశమోఽనువాకః

గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్రవిశ్చ మే త్రవీ చ మే
దిత్యవాఠ్ చ మే దిత్యౌహీ చ మే పంచావిశ్చ మే
పంచావీ చ మే త్రివత్సశ్చ మే త్రివత్సా చ మే
తుర్యవాట్ చ మే తుర్యౌహీ చ మే పష్ఠవాట్ చ మే పష్ఠౌహీ చ మ
ఉక్షా చ మే వశా చ మ ఋషభశ్చ మే వేహశ్చ మే
ఽనడ్వాంచ మే ధేనుశ్చ మ ఆయుర్యజ్ఞేన కల్పతాం
ప్రాణో యజ్ఞేన కల్పతామపానో యజ్ఞేన కల్పతాం
వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతా
శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం
వాగ్యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం
యజ్ఞో యజ్ఞేన కల్పతాం   ౧౦

ఇతి దశమోఽనువాకః

అథ ఏకాదశోఽనువాకః
 
ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే
నవ చ మ ఏకదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే
సప్తదశ చ మే నవదశ చ మ ఏక విశతిశ్చ మే
త్రయోవిశతిశ్చ మే పంచవిశతిశ్చ మే
సప్తవిశతిశ్చ మే నవవిశతిశ్చ మ
ఏకత్రిశచ్చ మే త్రయస్త్రిశచ్చ మే
చతస్రశ్చ మేఽష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే
విశతిశ్చ మే చతుర్విశతిశ్చ మేఽష్టావిశతిశ్చ మే
ద్వాత్రిశచ్చ మే షట్త్రిశచ్చ మే చత్వరిశచ్చ మే
చతుశ్చత్వారిశచ్చ మేఽష్టాచత్వారిశచ్చ మే
వాజశ్చ ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ
వ్యశ్నియశ్చాన్త్యాయనశ్చాన్త్యశ్చ భౌవనశ్చ
భువనశ్చాధిపతిశ్చ  ౧౧

ఇతి ఏకాదశోఽనువాకః

ఇడా దేవహూర్మనుర్యజ్ఞనీర్బృహస్పతిరుక్థామదాని
శసిషద్విశ్వేదేవాః సూక్తవాచః పృథివీమాతర్మా
మా హిసీర్మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి
మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాస
శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం  మా దేవా అవన్తు
శోభాయై పితరోఽనుమదన్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇతి శ్రీ కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహితాయాం
చతుర్థకాండే సప్తమః ప్రపాఠకః

తాత్పర్యము:  

మొదటి అనువాకము:
ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ!  మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక. 

రెండవ అనువాకము:
నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు,  ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి,  అపాన వ్యానాదులు,  ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక. 

మూడవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు,   అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.

నాలుగవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - ఇహ లౌక, పారలౌకిక ఆనందాలు, కోరిక, దాని ఫలము, ప్రీతి కలిగించే బంధు జనము, రక్షణ, యశస్సు , కీర్తి, మంచి అలవాట్లు, అదృష్టము, సంపద, తండ్రి వలె నన్ను నడిపించే సద్గురువు,  ఆస్తులను కాపాడుకునే శక్తి, స్థైర్యము, మంచితనము, గుర్తింపు, వేద శాస్త్రాల జ్ఞానము, అధ్యాపకత, పని చేసే, చేయించ గలిగే సామర్థ్యము, ఆజ్ఞాపించే అధికారము, పశు సంపద, అవరోధము లేని మార్గము, మంచి అగ్నిహోత్రము, ద్రవ్యములు, వాటి వలన కలిగే శుభములు, క్షయ వ్యాధి నుంచి రక్షణ, జ్వరములనుండి రక్షణ, ఔషధ సేవ లేని జీవితం, దీర్ఘాయుష్షు, అందరితో స్నేహంగా ఉండే వాతావరణము, నిర్భయము, సత్ప్రవర్తన, మంచి నిద్ర, మంచి ఉదయము, మంచి రోజులు - నాతో ఉండు గాక. 

అయిదవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - భుక్తి, మంచి వాక్కు, పాలు, మీగడ, నెయ్యి, తేనె, బంధువులతో భోజనము, పానము, వ్యవసాయము, వర్షములు, విజయ భూమి, వృక్షములు, మొక్కల సేద్యము, స్వర్ణము, రత్నములు, సంపదతో వచ్చే కీర్తి, ఆరోగ్యము, విలువైన పంట, మంచి పంట తెచ్చే ఇతర శుభములు, దినదినాభి వృద్ధి, పూర్ణత్వము, ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది, మరణము లేని స్థితి, బియ్యము, సజ్జలు, గోధుమలు, రాగులు, మినుములు, పెసలు మొదలగు ధాన్యములు, నూనె గింజలు, పప్పు దినుసులు - అన్ని నా వద్ద సమృద్ధిగా ఉండు గాక.

ఆరవ అనువాకము:

ఓ రుద్రా!  నిన్ను అర్చించుట వలన - రాళ్ళు, మట్టి, కొండలు, పర్వతాలు, ఇసుక, భూమి యందు పెరిగే అన్ని వస్తువులు, అన్ని రకముల ఖనిజములు, లవణాలు, అగ్ని, నీరు, తీగ మొక్కలు,  ఔషధపు మొక్కలు, పెంచేవి, పెంచని మొక్కలు, గ్రామాలలో, అరణ్యాలలో ఉండే సంపద, పశుసంపద, అగ్నిహోత్రములో వాడే ద్రవ్యములు,  పిత్రార్జితములు, సంతానము మరియు ఇతరులకు చెందిన ఆస్తులు, స్థిర, చరాస్తులు, నా ధర్మమునకు చెందిన కర్మలు, కర్మలు చేయుటకు కావలసిన శక్తి, వాటి ఫలము, ఆనందము పొందే సాధనములు, వాటి ఫలితములు - నాతో ఉండు గాక. 

ఏడవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన -  అగ్ని మరియు ఇంద్రుడు, చంద్రుడు మరియు ఇంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు, సరస్వతి మరియు ఇంద్రుడు, పూషా మరియు ఇంద్రుడు, బృహస్పతి మరియు ఇంద్రుడు, మిత్రుడు మరియు ఇంద్రుడు, వరుణుడు మరియు ఇంద్రుడు, త్వష్ట మరియు ఇంద్రుడు, ధాత మరియు ఇంద్రుడు, అశ్వినీ దేవతలు మరియు ఇంద్రుడు, మరుత్ దేవతలు మరియు ఇంద్రుడు, వసువులు మరియు ఇంద్రుడు, భూమి మరియు ఇంద్రుడు, అంతరిక్షము మరియు ఇంద్రుడు, స్వర్గము మరియు ఇంద్రుడు, నాలుగు దిక్కులు మరియు ఇంద్రుడు, మూర్ధ్నము మరియు ఇంద్రుడు, ప్రజాపతి మరియు ఇంద్రుడు - నన్ను ఆశీర్వదించు గాక.

ఎనిమిదవ అనువాకము:


ఓ రుద్రా! నిన్ను అర్చించుట కొరకు  -  సోమయాగమునకు కావలసిన పాత్రలు, ఆజ్య పాత్రలు, ఘ్రుత పాత్రలు,  ఇంద్రాది దేవతలకు సమర్పించ వలసిన సోమరస పాత్రలు,  ఆశ్వినాది ఇతర దేవతలకు సోమరస పాత్రలు, వైశ్వదేవాది దేవతలకు సోమరస పాత్రలు మొదలగునవి నా చేత ఉన్నాయి.

తొమ్మిదవ అనువాకము:

ఓ రుద్ర! నేను నీ భక్తుడనయినందు వలన - మర్రి చెట్టు చిదుగులు, దర్భలు, యాగశాల, సహాయమునకు స్త్రీలు, సోమరస పాత్రలు, సోమ తీగ చిగుళ్ళు నూరుటకు రాళ్ళు, సమిధలు, చెక్కలు, అగ్ని సృష్టించుటకు భూమిలో రంధ్రములు, ద్రోణము, వాయవ్యసము, ఇతర పవిత్రమైన పాత్రలు,యాగ ద్రవ్యములు ఉంచుటకు, స్త్రీలు ఆసీనులు అగుటకు, ఇతరులు వీక్షించుటకు ప్రదేశము, చెరువు (హోమములో హుతమునకు), బలి, అనంతరము స్నానమునకు ప్రదేశము, సమిథలతో పాటు హవానములో వేసే ఇతర ద్రవ్యములు నా చెంత ఉండు గాక.

పదవ అనువాకము:

ఓ రుద్రా! నేను నీ భక్తుడనయినందు వలన యాగామునకు కావాల్సిన అగ్ని, అగ్ని కార్యమునకు కావాల్సిన ఇతర పూర్వ కార్యక్రమములు, దిక్పాలకులకు, పంచాభూతములకు చేయవలసిన సమర్పణ (ఆశ్వాది బలులు), వేద పారాయణ , ప్రాయశ్చిత్తము, శాంతి హోమములు, పూర్ణాహుతి ముహూర్త నిర్ణయం, పూర్ణాహుతి కార్యక్రమము, ఇతర క్రియలు నా చేతుల మీదుగా జరుగు గాక.

(ఇక్కడ గో స్తన్యము నుండి పాలు త్రాగుట, అశ్వాన్ని బలి ఇవ్వటం, వివిధ దేవతలకు బలి సమర్పించటం, శుద్ధి, ప్రాయశ్చిత్తం వివరాలు పై రెండు అనువాకాల్లో పేర్కొన బడ్డాయి)

పదకొండవ అనువాకము:

గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు  దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం -  ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు,  ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు. ).

కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక.  బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక. 

ఓం శాంతి శాంతి శాంతి ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది

నమకమ్

రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి - లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ఇలా.



శ్రీ రుద్రప్రశ్నః నమకమ్

అథ ప్రథమోఽనువాకః
          
ఓం నమో భగవతే రుద్రాయ

ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః

యాత ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయా

యా తే రుద్ర శివా తనూరఘోరాపాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి

యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్‍ంసీః పురుషం జగత్

శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్‍ం సుమనా అసత్

అధ్యవోచ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీగ్‍ంశ్చ సర్వాం జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగలః
యే చేమాగ్‍ం రుద్రా అభితో దిక్షు
శ్రితాః సహస్రశోవైషాగ్‍ం హేడ ఈమహే

అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
అథో యే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః

ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం
యాశ్చ తే హస్త ఇషవః
పరా తా భగవో వప

అవతత్య ధనుస్త్వగ్‍ం సహస్రాక్ష శతేషుధే
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్‍ం ఉత
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషన్గథిః

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః
తయాఽస్మాన్విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే

పరి తే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తం

హస్తే దిక్ష్విషవ ఉభాభ్యాం ద్వావిగ్‍ంశతిశ్చ

ఇతి ప్రథమోఽనువాకః

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఓమ్

అథ ద్వితీయోనువాకః

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో నమో
హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహంత్యాయ వనానాం పతయే నమో

నమః రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః

వనానాం పతయే నమో నమ ఏకాన్నత్రిగ్‍ంశచ్చ

ఇతి ద్వితీయోనువాకః

అథ తృతీయోనువాకః

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో
నమః కకుభాయ నిషంగిణే స్తేనానాం పతయే నమో
నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమః
సృకావిభ్యో జిఘాసద్భ్యో ముష్ణతాం పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తం చరధ్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో
నమః ఇషుమధ్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛధ్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్ధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమ స్తిష్ఠధ్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః

కులు ఞ్చానాం పతయే నమో నమోశ్వపతిభ్య స్త్రీణి చ

ఇతి తృతియోఽనువాకః

అథ చతుర్థోఽనువాకః

నమ ఆవ్యధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో నమ
ఉగణాభ్యస్తృగ్‍ంహతీభ్యశ్చ వో నమో నమో
గృత్సేభ్యో గ్రుత్సపతిభ్యశ్చ వో నమో నమో
వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో
గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో
విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో
మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో
రథిభ్యోరథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యః

రథపతిభ్యశ్చ వో నమో నమః
సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమః
క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమ
స్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః
కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః
పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమ
ఇషుకృద్భ్యో ధన్వకృధ్భ్యశ్చ వో నమో నమో
మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో నమః
శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః

రథేభ్యః శ్వపతిభ్యశ్చ ద్వేచ

ఇతి చతుర్థోఽనువాకః

అథ పంచమోఽనువాకః  

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ
నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్ధ్వనే చ

నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ్ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ

సంవృద్ధ్వనే చ పంచవిగ్‍ం శతిశ్చ

ఇతి పంచమోఽనువాకః  

అథ షష్ఠోఽనువాకః

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ
నమః పూర్వజాయ చాపరజాయ చ
నమో మధ్యమాయ చాపగల్భాయ చ
నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ
నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ
నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ
నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ
నమః శ్లోక్యాయ చావసాన్యాయ చ
నమో వన్యాయ చ కక్ష్యాయ చ
నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ
నమః శూరాయ చావభిన్దతే చ
నమో వర్మిణే చ వరూథినే చ
నమో బిల్మినే చ కవచినే చ
నమః శ్రుతాయ చ  శ్రుతసేనాయ చ

ప్రతిశ్రవాయ చ పంచవిగ్‍ంతిశ్చ

ఇతి షష్ఠోఽనువాకః

అథ సప్తమోఽనువాకః 

నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమ ఈఘ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ

వైశన్తాయ చ త్రిగ్‍ం శచ్చ

ఇతి సప్తమోఽనువాకః

అథ అష్టమోఽనువాకః

నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ
నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ
నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
నమస్తారాయ నమః శంభవె చ మయోభవె చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ  చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ
నమః పార్యాయ చావార్యాయ చ
నమః ప్రతరణాయ చోత్తరణాయ చ
నమ ఆతార్యాయ చాలాద్యాయ చ
నమః శష్ప్యాయ చ ఫేన్యాయ చ నమః
సికత్యాయ చ ప్రవాహ్యాయ చ

శివతరాయ చ త్రిగ్‍ంశచ్చ

ఇతి అష్టమోఽనువాకః

అథ నవమోఽనువాకః

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్‍ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్‍ంసవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ

నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్‍ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః

ఉలప్యాయ చ త్రయస్త్రిగ్‍ంశచ్చ

ఇతి నవమోఽనువాకః

అథ దశమోఽనువాకః

ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మారో మో ఏషాం కిన్చనామమథ్

యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహ భేషజీ
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే

ఇమాగ్‍ంరుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం
యథా నః శమసధ్ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే ఆస్మిన్ననాతురం

మృడా నో రుద్రోతనో మయస్కృధి క్షయద్వీరాయ నమసా విధేమ తే
యచ్ఛం చ యోశ్చ మనురాయజే పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ

మా నో మహాన్తముత మా నో అర్భకం
మా న ఉక్షంత ముత మా న ఉక్షితం
మా నో వధీః పితరం మోత మాతరం ప్రియా మానస్తనువో రుద్ర రీరిషః

మానస్తోకే తనయే మా న ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః
వీరాన్మా నో రుద్ర భామితోఅవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే

ఆరాత్తే గోఘ్న ఉత్త పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మే తే అస్తు
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యథా చ నః శర్మ యచ్ఛ ద్విబర్హాః

స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం
మ్రుడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః

పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతిరఘాయోః
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ

మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ
పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం విభ్రదాగహి

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః
యాస్తే సహస్రగ్‍ం హేతయోఽన్యమస్మన్నివపన్తు తాః

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హ్తయః
తాసామీశానో భగవః పరాచీనానా ముఖా కృధి

అస్మిగ్గ్‍ం స్తనువ స్తుహి పినాక మేకాన్న త్రిగ్‍ం శచ్చ

ఇతి దశమోఽనువాకః

అథ ఏకాదశోఽనువాకః

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యాం
తేషాగ్‍ంసహస్రయోజనేఽధన్వాని తన్మసి

అస్మిన్ మహత్యర్ణవేఽంతరిక్షే భవా అధి
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్‍ం రుద్రా ఉపశ్రితాః
యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషంగిణః
య ఏతావంతశ్చ భూయాగ్‍ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే
తేషాగ్‍ంసహస్రయోజనే  అవధన్వాని తన్మసి
నమో రుద్రేభ్యో యే పృథివ్యాం యేఽంతరిక్షే
యే దివి యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ
ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో
నమస్తే నో మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి
తం వో జంభే దధామి

తీర్థాని యశ్చ షట్చ

ఇతి ఏకాదశోఽనువాకః

త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు
యో రుద్రో విశ్వా భువనాఽఽవివేశ
తస్మై రుద్రాయ నమో అస్తు

తముష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నభోభి ర్దేవమసురం దువస్య

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః
అయం మే విశ్వాభేషజోఽయం శివాభిమర్శనః

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి
ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ
నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఇతి శ్రీకృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహితాయాం
చతుర్థకాండే పంచమః ప్రపాఠకః


తాత్పర్యము:

మొదటి అనువాకము: 

భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక.

రెండవ అనువాకము:

జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు. స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము.

మూడవ అనువాకము: 

శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

నాలుగవ అనువాకము: 

దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

అయిదవ అనువాకము:

సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో  ఉన్నరుద్రునికి నా నమస్కారములు.

ఆరవ అనువాకము: 

అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు,   వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు,  గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

ఏడవ అనువాకము:

పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు,  మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను,  వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.

ఎనిమిదవ అనువాకము:

ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు,  రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు

తొమ్మిదవ  అనువాకము:

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు,  ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో,  మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు,  ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు,  కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.  

పదవ అనువాకము:

పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు.  మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక.  నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక.  ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము.  భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా!  శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర!  నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.

పదకొండవ అనువాకము: 

ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు,   కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు,  పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.

ఓం శాంతి శాంతి శాంతి. ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, అయిదవ ప్రపాఠకములోనిది.

మహాన్యాసము


నారుద్రో రుద్రమర్చయేత్ - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?

మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.

౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

౧. ప్రథమాంగన్యాసము

భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.

౨. ద్వితీయాంగన్యాసము

ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.

౩. తృతీయాంగన్యాసము

సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.

తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము -  ఓం  అం విభూరసి  ప్రవాహణో.... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః  ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.

౪. చతుర్థాంగన్యాసము

"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.

౫. పంచమాంగన్యాసము

ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.

తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.


తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.

తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).

వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.  

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.

లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని  తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).

[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి"  అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]

ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.

దక్షిణామూర్తి స్తోత్రము


విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

నానాచ్ఛిద్రఘటోదరస్థిత్మహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిం స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతం
శిష్యాచార్యతయా తయైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

భూరంభాస్యనలోఽనిలోఽంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే 

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి


తాత్పర్యము:

ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.  నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు.  మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము)  పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై  శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా  తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది.  మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,  అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్,  చేతన, సుషుప్తా మొదలగునవి)  వచ్చే మార్పులకు అతీతంగా  ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి),  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.

సంసార బంధములు, జనన మరణ  ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

కాలభైరవాష్టకం


దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం
కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

           ఫల శ్రుతి

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం
శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్

తాత్పర్యము:
దేవేంద్రునిచే పూజించబడిన పాదపద్మములు కలిగిన, సర్పమును యజ్ఞోపవీతము గా కలిగిన వాడు, చంద్రుని ధరించిన వాడు, కృపాకరుడు, దిక్కులనే వస్త్రములుగా కలిగిన వాడు, నారదాది మునులచే పూజించ బడిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అజేయమైన త్రిశూలము కలవాడు, నాశనము లేని వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు,  నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేని వాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

కోరికలు తీర్చి, మోక్షాన్ని ప్రసాదించే వాడు,  పేరుగాంచిన సౌందర్యమున్న దేహము కలవాడు, శివుని రూపమైన వాడు (స్థిరమైన వాడు), భక్త ప్రియుడు, లోకేశ్వరుడు, వేరు వేరు రూపములలో విలసించే వాడు, చిరు గజ్జెలు కలిగిన బంగారు మొలత్రాడు ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

ధర్మమనే సేతువును పాలించేవాడు, అధర్మ మార్గములను నాశనము చేసే వాడు, కర్మ బంధములనుండి తప్పించే వాడు, మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించే వాడు,  బంగారు రంగులో ఉన్న పాశము, సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

రత్నములు పొదిగిన పాదుకలచే అలరారు పాదములు కలిగిన వాడు,  అంతటాయున్న వాడు, రెండవసాటి లేని వాడు, ఇష్ట దైవమైన వాడు, కామ్యములు తీర్చేవాడు, మానవులకు మృత్యు భయమును తొలగించే వాడు, తన దంతముల ద్వారా మోక్షమును కలిగించే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

బ్రహ్మచే సృష్టించ బడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగిన వాడు,  సర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు, తెలివైన వాడు, చండ శాసనుడు, అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు (అణిమ, గరిమ మొదలగునవి),  కపాలముల మాల ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

భూత నాయకుడు, ఎనలేని కీర్తిని ప్రసాదించే వాడు, కాశీ పుర వాసుల మంచి చెడును విచారించే వాడు, నీతి మార్గములో నిపుణుడు, శాశ్వతుడు, జగత్పతి, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

ఫల శృతి 

అనంతమైన జ్ఞాన మూలమైన, సత్కార్యముల ఫలమును పెంచే, శోకము, మోహము, దారిద్ర్యము, కోరిక, క్రోధము నశింపచేసే ఈ మనోహరమైన కాలభైరవాష్టకం పఠించే  వారికి ఆ భైరవుని సన్నిధి ప్రాప్తించును. 

ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం.

దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము




విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ
గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ ఫాలేక్షణాయ మణికుండలమండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ
ఆనందభూమివరదాయ తమోమయాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

          వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం
          సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనం
          త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్


తాత్పర్యము: 

విశ్వేశ్వరుడు, నరకమనే సాగరమును దాటించేవాడు, శ్రవణానంద మైన వాడు, నెలవంకను ధరించిన వాడు, కర్పూరము యొక్క కాంతి వలె తెల్లగా ఉన్నవాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పార్వతీ ప్రియ వల్లభుడు, చంద్ర వంకను ధరించిన వాడు, యముని అంతము చేసే వాడు, సర్పములను కంకణములుగా ధరించిన వాడు, గంగను కేశములలో ధరించిన వాడు, గజాసురుని సంహరించిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

భక్తులకు ప్రియుడు, రోగ భయమును పోగొట్టే వాడు, ఉగ్రుడు, సంసారమనే సాగరాన్ని దాటించే వాడు,  జ్యోతిర్మయుడు, గుణ నామ కీర్తనకు నృత్యం చేసే వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పులిచర్మమును ధరించే వాడు, శ్మశానములో కాలే శవముల భస్మమును శరీరమునకు పూసుకొనిన వాడు, నుదుట కన్ను కలవాడు, రత్నములు పొదిగిన కుండలములు చెవులకు ధరించిన వాడు, మంచి ధ్వని కలిగించే ఆభరణములు కాళ్ళకు ధరించిన వాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పంచముఖములు కలిగిన, ఫణి రాజు ఆభరణముగా కలిగిన వాడు, బంగారు వస్త్రములు ధరించిన వాడు, త్రిలోక వంద్యుడు, వర ప్రదాత, ఆనంద సాగరుడు, అంధకారము నిండినవాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పార్వతీదేవి యొక్క విలాసమునకు ప్రపంచమైన వాడు, మహేశ్వరుడు, ఐదు ముఖములు కలిగిన వాడు, శరణన్న వారి పాలిటి కల్పతరువు, వారికి సర్వం తానైన వాడు, సర్వలోకాలకు అధిపతి, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

 సూర్యునికి ప్రియమైన వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, యముని సంహరించేవాడు, బ్రహ్మచే పూజించబడిన వాడు, మూడు కన్నులు కలిగిన వాడు, అన్ని శుభలక్షణములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

రామునికి ప్రియమైన వాడు, రామునికి వరములు ప్రసాదించిన వాడు, నాగ జాతికి ప్రియమైన వాడు, నరకమనే సాగరాన్ని దాటించేవాడు, పుణ్యాల్లో పుణ్యము కలిగిన వాడు, దేవతలచే కొలువబడిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

వశిష్ఠ మహాముని రచించిన ఈ స్తోత్రము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పఠించిన వారికి అన్ని సంపదలు కలిగి చివరకు స్వర్గ ప్రాప్తి కలుగును.