భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుబ్రమైన వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయమునచే అలికి సర్వతో భాద్రంబాను ఎనమిది దళములు గల తమ పుష్పము వంటి మండలమును నిర్మించి, ఆ మండలమునకు చుట్టునూ పంచవర్ణపు ముగ్గులతోను, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆవేదికకు దక్షిణ పార్శ్వమున వుదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకున్దయినా అనంత పద్మనాభస్వామిని దర్భతో ఏర్పరచి అందు ఆవాహనము చేసి.
శ్లో: క్రుత్వాదర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం,
సమన్వితం సప్తఫణై పింగాలాక్షం చతుర్భుజం.
అను ఈ శ్లోకము చేత శ్వేత ద్వీపవాసియగు, పిన్గాలాక్షుడగు, సప్తఫణి సాహితున్డగు, శంఖ చక్ర గదా ధరున్డుగాను ధ్యానము చేసి, కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి, ప్రదక్షిణ నమస్కారములు గావించి, పదునాలుగు ముళ్ళు గలిగి కుంకుమతో తడసిన క్రొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున వుంచి పూజించి అయిడుపల్ల గోధుమపిండితో ఇరువది ఎనమిది అతిరసములన్ జేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానము ఇచ్చి తక్కిన వానిని తాను భుజిమ్పవలేయును. మరియు పూజాద్రవ్యములన్నియు పడులాలుగేసి వుండవలేయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంతపద్మనాభ స్వామిని ధ్యానించుచు నున్దవలేయును. ఓ శీలా! ఇట్లు వ్రతము పరిసమాప్తముచేసి ప్రతి సంవత్సరము వుద్వాసనము చేసి మరల వ్రతము ఆచరిన్చుచున్దవలెను. అని ఆ వనితామణులు చెప్పిరి. అంట ఆ షీలా తక్షణంబున స్నానం చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకొని దారి బట్టేమునకుగాను తెచ్చిన సత్తుపిందిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్ట యై, భోజనాడులచే సంత్రుప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు బోయెను.
అంతట శీల అనంత వ్రతం ఆచరించిన మహాత్యమువలన ఆ ఆశ్రమము అంతయు స్వర్ణమయముగాను, గృహం అష్ట ఐశ్వర్య యుక్తముగాను ఉండుట చూచి ఆ దంపతులు ఇరువురు సంతోష భరితులై సుఖముగానున్దిరి. శీలా-గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములన్ గావించుచుండెను.
అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుంది యుండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల సందితమునుండు తోరముచూచి "ఓ కాంతా! నీవు సందియందొక తోరమును గట్టుకొనియున్నావుకదా! అది ఎందులకు కట్టుకొను యున్నావు? నన్ను వశ్యము చేసుకోనుతకా లేక మరియోకరిని వష్యంబు చేసుకోనుతకా అని అడిగెను. అప్పుడు షీలా ఇట్లనియె.
"ఓ ప్రాణ నాయకా! అనంతపద్మనాభస్వామి ని ధరించియున్నాను. ఆదేవుని అనుగ్రహంబున వలననే మనకీ ధనదాన్యాది సంపత్తులు గలిగి యున్నవని" తెలిపెను. అప్పుడు కౌదిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి అనంతుదనగా యే దేవుడు అని దూశించుచూ ఆ తోరమును త్రెంచి భాభా మండుచుండేది అగ్ని లో పదవేచెను. అంత ఆ శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో తడపి పెట్టెను.
పిదప కొన్ని రోజులకు కౌదిన్యుడు చేసిన ఇట్టి అపరాధమువలన అతని ఐశ్వర్యము అంతయు నశించి గోధనములు దొంగల పాలగును. గృహము అగ్నిపాలయ్యేను. మరియు గృహమునండున్న వస్తువులు ఎక్కడివి అక్కడే నశించెను. ఎవరితో మాట్లాడినాను ఆకారణముగా కలహములు వచ్చుచుండెను.
అంతటా కౌదిన్యుడు ఏమియునుదోచక దారిద్ర్యముచే పీడింప బడుచూ అడవులందు ప్రవేశించి క్షుద్భాదా పీడితుండై అనంతపద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుడిని యెట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒక చోట పుష్ప ఫల భారితమగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షియైనాను వ్రాలకుండుట చూచి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లనియె: ఓ వ్రుక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచితివా? యని అడుగగా ఆ వృక్షము నే నేరుగానని చెప్పెను.
అంత కౌండిన్యుడు మరికొంత దూరముపోయి పచ్చిగాద్దిలో ఇటుఅటు తిరుగుచున్న దూడతో గూడిన ఒక గోవును చూచి, ఓ కామధేనువా! అనంతపద్మనాభ స్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభస్వామి ఎవరో నే నేరుగాను అని చెప్పెను.
పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు మత్తు పచ్చికలో నిలుచున్న ఒక వ్రుశాభామును చూచి ఓ వ్రుశాభారాజమా! అనంతపద్మనాభ స్వామి ని చూచితివా అని అడిగిన, అనంతపద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అనిచేప్పెను.
పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులు తరంగంబులతో గూదియును కమల కల్హార కుముదోత్ఫలంబుల తోడ గూదియును, హన్సకారండవ చక్రకాడులతో గూదియును, ఒక కొలనునుంది జలంబులు మరియొక కొలనుకి పోరాలుచున్డుతయును చూచి, ఓ కమలాకరంబులారా! మీరు అనంత పద్మనాభ స్వామి ని చూచితిరా యని అడిగెను. అందులకు ఆ పుష్కరినిలు మే మేరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచుని యుండెను. వాటిని జూచి మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అవి అనంతపద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాదానమిచ్చిరి.
అంతటా కౌదిన్యుడు ఎంతో విచారముతో బాధతో మూర్చబోయి క్రిందపడెను. అప్పుడు భగవంతుని కృప గలిగి వృద్ద బ్రాహ్ణణ రూపదారుడై కౌదిన్యుని చెంతకు వచ్చి " ఓ విప్రోత్తమా! ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకపోఎను. అంతటా ఆ గృహము నవరత్న మణిగణ ఖచితంబగు దేవాంగనల తోడ గూడియు ఉండుట చూచి ఆశ్చర్యంబు చెంది, సదా గరుడ సేవితున్డుగాను, శంఖ చక్ర ధరున్డుగాను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగారమగ్నున్డై భగవంతుని ఈ విధంబుగా ప్రార్ధించెను.
నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభాలాన్చన త్వన్నమ స్మరణా త్పాపమశేషం నఃప్రణశ్యతి, నమోనమస్తే గోవిందా నారాయణా జనార్దనా" యని ఇటుల అనేక విధములుగా స్తోత్రంచేసిణ అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై "ఓ విప్రోత్తమా! నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించితిని. నేకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభావించకున్డునటులను, అంత్యకాలమున శాశ్వత విశ్నులోకము గలుగునట్లు వరము ఇచ్చితిని అనెను.
అప్పుడు కొందిన్యుడు ఆనందముతో ఇట్లనెను.
ఓ జగన్నాధా! నేను మార్ఘ మధ్యలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతము ఏమిటి ? ఆ ఆవు ఎక్కడిది? ఆ వృషంభు ఎక్కడినుండి వచ్చెను? ఆ కొలను విశేషము ఏమిటి? ఆ గాడిద ఏనుగు, బ్రాహ్మనులు ఎవరు? అని ఆ భగవంతుడిని అడిగెను. అపుడు ఆ పరమాత్ముడు.
ఓ బ్రాహ్ణణ శ్రేష్టుడా! పూర్వము ఒక బ్రాహ్ణణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను. ఒకడు మహా భాగ్యవంతుడై యుండి తన జీవిత కాలమునందు ఎన్నడును బ్రాహ్ణణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగుచున్నాడు. పూర్వము ఒక రాజు ధనమదాన్దుడై
బ్రాహ్ణణులకు చవితి భూమిని దానము జేసినందున ఆ రాజు వ్రుషభంబై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలంకులు రెండును ఒకటి ధర్మమూ, మరియొకటి అధర్మము. ఒక మానవుడు సర్వదా పరులను దూశించుచూ నున్దినందున గాదిదయై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానె విక్రయించి వెనకేసుకోనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుదనైన నేనే బ్రాహ్ణణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని. కావున నీవు ఈ వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరిన్చితివేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చెదనని వచించి భగవంతుడు అంతర్దానము నొందేను.
పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంత మంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రాతంబు నాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్రమందలము చేరెను.
ఓ ధర్మరాజా! ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునండు కాన బడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రాతంబు ఆచరించి లోకంబున ప్రసిద్ది పొందెను. సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అంత్యంబున స్వర్గమును బొందిరి. కావున ఈ వ్రత కథను సంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులు ననుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుదురు.