Saturday, 10 September 2011

అనంతపద్మనాభ స్వామి వ్రత కథ 1

అనంతపద్మనాభ స్వామి వ్రత కథ
సూతపౌరాణికుడు శౌనకాది మహర్షులను గాంచి యిట్లనియె! మునిశ్రేష్టులారా! లోకమున మనుష్యులు దారిద్ర్యముచే పీడింప బడుచున్డిరి . అట్టి దారిద్ర్యమును తోలగాచేయునట్టి ఒక వ్రత శ్రేష్టంబు కలదు. దానిని జెప్పెద వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్య వాసము చేయుచు అన్నో కష్టములను అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుని గాంచి " మహాత్మా! నేను తమ్ములతో కలసి అనేక దినములుగా అరణ్య వాసము చేయుచూ ఎన్నో కష్టములను అనుభవించుచున్నాను. ఇట్టి కష్టసాగారము నందుండి కడతేరునట్టి వుపాయమును చెప్పవలేయునని ప్రాధించిన శ్రీకృష్ణుడు యిట్లనియె.
" ధర్మరాజ! పురుషునకును, స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రాతమను ఒక వ్రతము కలదు. మరియు అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేయవలెయును. అట్లు గావించిన కీర్తియును, సుఖమును, శుభమును, పుత్రలాభమును గలుగును" అని వచించిన ధర్మరాజు యిట్లనియె.
" రుక్మిణీ ప్రానవల్లభా! అనంతుడను దైవంబు ఎవరు? అతడి ఆదిశేషుడా! లేక తక్షుడా! లేక సృష్టికర్త యైన బ్రహ్మయా! లేక పరమాత్మ స్వరూపుడా" అని అడిగిన శ్రీ కృష్ణుడు యిట్లనియె.
" పాండుపుత్ర! అనంతుదనువాడను నేనేతప్ప మరిఎవరో కాదు.సూర్య గమనముచే కలాకష్ట ముహూర్తములనియు, పగలు రాత్రనియు, యుగసంవత్సర ఋతు మాసకల్పమనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను, అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకును, రాక్షస సంహారము కొరకును వాసుదేవుని గృహమున జన్మించితిని. నన్ను క్రుశ్నునిగాను, విష్ణువు గాను, హరిహరబ్రహ్మలుగను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను, సృష్టి స్థితి లయ కారనభూతునిగాను, అనంతపద్మనాభునిగాను, మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగాను ఎరుగుదురు. నా హృదయమునందే పదునాలుగు ఇంద్రులును, అష్టావసువులును, ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, సప్త ఋషులును, భూర్భు వస్స్వర్లోకాదులు నున్నవో అట్టి నా స్వరూపమును నీకు తెలిపితిని" అనిన ధర్మరాజు శ్రీ కృష్ణుని గాంచి " జగన్నాధ! నీవు వచించిన అనంత వ్రతమును యేతుల ఆచరిన్చావలేయును? వ్రతము ఆచరించిన ఏమి పహలము గలుగును? ఏయే దానములు చేయవలెయును? దైవమును పూజింపవలెను? పూర్వం ఎవరైనా వ్రతం ఆచరించి సుఖము జెందిరి? అని ధర్మరాజు అడుగగా! శ్రీకృష్ణుడు యిట్లనియె.
" ధర్మరాజ! చెపాడ వినుము. పూర్వము వశిష్ట గోత్రోద్భవుడు , వేద శాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాంహ్మణుడు కలదు. అతనకి భ్రుగుమహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు. దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయుచుండగా కొంత కాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగునవతియగు ఒక కన్యను గనెను. బాలికకు షీలా అను నామకరణము చేసిరి.
ఇట్లు వుండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాప జ్వరముచే మృతి చెందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశ యను ఒక కన్యను వివాహము చేసుకొనెను. కర్కశ ఎంతో కటిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహాకారిణి గాను, ఉండెను. ఇట్లుండ మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రికయైన శీల తండ్రి గృహముననే పెరుగుచూ, గోడల యందును, గడపలయందును, చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచు, కూటము మొదలగు స్థాలములయండు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టిచు దైవభక్తిగలదై యుండెను. ఇట్లుండగా ఆశీలకు వివాహ వయసు వచ్చినది. అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్నిదినములు తపస్సుచేసి, పిదప పెండ్లి చేసుకోవలేయునని కోరికగలిగి దేశదేశములను తిరుగుచూ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున మహామునికి తన కుమార్తె యగు శీలను ఇచ్చి వివాహము చేసెను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలచి తన భార్య యగు కర్కశ వద్దకు పోయి " ప్రియురాలా! మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేయునుగాడా! ఏమి ఇద్దాము అని అడుగగా, కర్కశ చివుక్కున లేచి లూపలికి వెళ్ళి తలుపులు గడియవేసుకొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను. అంత సుమంతుడు ఎంతో చింతించి దారి బట్టేమునకైన ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన పెలపుపిండి ఇచ్చి అల్లుడితోనిచ్చి కూతురుని పంపెను. అంత కౌదిన్యుడును సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండిఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు బోవుచూ మధ్యాహ్నవేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండిదిగి తటాకంబునకేగెను. నాటిదినమున అనంతపద్మనాభ చతుర్దశి గావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు యెర్రని వస్త్రములను ధరించుకొని ఎంతో భక్తిశ్రద్దలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌదిన్యుని భార్య యగు శీల అది చూచి మెల్లగా స్త్రీల యొద్దకు వెళ్ళి, " వనితా మణులారా! మీరు ఎదేవుని పూజించుచున్నారు? వ్రతము పేరేమి? నాకు సవిస్తారముగా తెలుపగలరు అని ప్రార్ధించగా, పతివ్రతలు యిట్లనిరి. " పుణ్యవతి చెప్పెదము వినుము. ఇది అనంత పద్మనాభ వ్రతము. వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును.