Friday, 15 June 2012

భజ గోవిందం

భజ గోవిందం
ఓం స్థాపకయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే |
అవతర వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ: ||

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||1||

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||2||

నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం |
ఎతన్మాంసావసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||3||

నలినీదలగత జలమతితరలం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||4||

యావద్విత్తోపార్జన సక్త:
స్తావన్నిజ పరివారో రక్త: |
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే ||5||

యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మింకాయే ||6||

బాలస్తావత్క్రీడాసక్త:
తరుణస్తావత్తరుణీసక్త: |
వృద్ధస్తావచ్చింతాసక్త:
పరే బ్రహ్మణి కోఽపి న సక్త: ||7||

కాతే కాంతా కస్తే పుత్ర:
సంసారోఽయమతీవ విచిత్ర: |
కస్య త్వం క: కుత ఆయాత:
తత్త్వం చింతయ తదిహ భ్రాత: ||8||

సత్సఙ్గత్వే నిస్స్ఙ్గత్వం
నిస్సఙ్గత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తి: ||9||

వయసిగతే క: కామవికార:
శుష్కే నీరే క: కాసార: |
క్షీణేవిత్తే క: పరివార:
జ్ఞాతే తత్త్వే క: సంసార: ||10||

మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాల: సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11||

దినయామిన్యౌ సాయం ప్రాత:
శిశిరవసంతౌ పునరాయాత: |
కాల: క్రీడతి గచ్ఛత్యాయు:
తదపి న ముఞ్చత్యాశావాయు: ||12||

ద్వాదశమఞ్జరికాభిరశేష:
కథితో వైయాకరణస్యైష: |
ఉపదేశో భూద్విద్యానిపుణై:
శ్రీమచ్ఛంకరభగవచ్ఛరణై: ||12అ||

కాతే కాంతా ధన గతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసం గతిరైకా
భవతి భవార్ణవతరణే నౌకా ||13||

జటిలో ముణ్డీ లుఞ్ఛితకేశ:
కాషాయాంబరబహుకృతవేష: |
పశ్యన్నపి చన పశ్యతి మూఢ:
ఉదరనిమిత్తం బహుకృతవేష: ||14||

అఙ్గం గలితం పలితం ముణ్డం
దశనవిహీనం జతం తుణ్డం |
వృద్ధో యాతి గృహీత్వా దణ్డం
తదపి న ముఞ్చత్యాశాపిణ్డం ||15||

అగ్రే వహ్ని: పృష్ఠేభాను:
రాత్రౌ చుబుకసమర్పితజాను: |
కరతలభిక్షస్తరుతలవాస:
తదపి న ముఞ్చత్యాశాపాశ: ||16||

కురుతే గఙ్గాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం |
జ్ఞానవిహిన: సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||17||

సుర మందిర తరు మూల నివాస:
శయ్యా భూతల మజినం వాస: |
సర్వ పరిగ్రహ భోగ త్యాగ:
కస్య సుఖం న కరోతి విరాగ: ||18||

యోగరతో వాభోగరతోవా
సఙ్గరతో వా సఙ్గవీహిన: |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||19||

భగవద్గీతా కిఞ్చిదధీతా
గఙ్గా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా ||20||

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాఽపారే పాహి మురారే ||21||

రథ్యా చర్పట విరచిత కంథ:
పుణ్యాపుణ్య వివర్జిత పంథ: |
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||22||

కస్త్వం కోఽహం కుత ఆయాత:
కా మే జననీ కో మే తాత: |
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||

త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్త: సర్వత్ర త్వం
వాఞ్ఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహసంధౌ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||

కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాఽత్మానం భావయ కోఽహం |
ఆత్మజ్ఞాన విహీనా మూఢా:
తే పచ్యంతే నరకనిగూఢా: ||26||

గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సఙ్గే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||27||

సుఖత: క్రియతే రామాభోగ:
పశ్చాద్ధంత శరీరే రోగ: |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముఞ్చతి పాపాచరణం ||28||

అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితత: సుఖలేశ: సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహిఆ (??) రీతి: ||29||

ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధానం
కుర్వవధానం మహదవధానం ||30||

గురుచరణాంబుజ నిర్భర భకత: ??
సంసారాదచిరాద్భవ ముక్త: |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||

మూఢ: కశ్చన వైయాకరణో
డుకృఞ్కరణాధ్యయన ధురిణ: |
శ్రీమచ్ఛంకర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణ: ||32||

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే |
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ||33||

ఇతి శ్రీమద్ఛంకరభగవత: కృతౌ
భజ గోవిందం సంపూర్ణం ||

గోవిందాష్టకం



రాధే గోవింద భజే
సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
 గోష్ఠప్రాఙ్గణరిఙ్గణలోలమనాయాసం పరమాయాసం |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం
 క్ష్మామా(క్ష్మాయా) నాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం ||1||

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసం
 వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలం |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం
 లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం ||2||

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం
 కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం
 శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం ||3||

గోపాలం (ప్ర) భులీలావిగ్రహగోపాలం కులగోపాలం
 గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలం |
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానం
 గోపీగోచర దూరం(పథికం) ప్రణమత గోవిందం పరమానందం ||4||

గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభం
 శశ్వధ్గోఖురనిర్ధూతోత్కృ(ద్ధ)త ధూలీధూసరసౌభాగ్యం |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం
 చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందం ||5||

స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం
 వ్యదిత్సంతీరథ దిగ్వస్త్రా హ్యుపుదాతుముపాకర్షంతం(దాతుముపాకర్షంతం తా:) |
నిర్ధూతద్వయషోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థం
 సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందం ||6||

కాంతం కారణకారణమాదిమనాదిం కాలమనాభాసం
 కాలిందీగతకాలియశిరసి ముహుర్నృత్యంతం (సు)నృత్యంతం |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
 కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందం ||7||

వృందావనభువి వృందారకగణవృందారా ధ్యం(ధిత) వందేఽహం
 కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందం |
వంద్యాశేషమహామునిమానసవంద్యానందపదద్వంద్వం
 వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం ||8||

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యో
 గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాఙ్ఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో
 గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవత: కృతౌ
శ్రీగోవిందాష్టకం సంపూర్ణం ||

Sunday, 5 February 2012

శివ పంచాక్షరి :


శివ పంచాక్షరి :
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై “న” కారాయ నమశ్శివాయ
.
మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధ నాధ మహేశ్వరాయ
మందారపుష్ప బహు పుష్పాసుపూజితాయ తస్మై “మ” కారాయ నమశ్శివాయ
.
శివాయ గౌరి వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీనీలకఠాయ వృషధ్వజాయ  తస్మై “శి” కారాయ నమశ్శివాయ
వశిష్ఠ కుంభోద్భవగౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై “వ” కారాయ నమశ్శివాయ
యక్షస్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై “య” కారాయ నమశ్శివాయ


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే..

Saturday, 10 September 2011

అనంత పద్మనాభ స్వామి కథ 2

భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుబ్రమైన వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయమునచే అలికి సర్వతో భాద్రంబాను ఎనమిది దళములు గల తమ పుష్పము వంటి మండలమును నిర్మించి, మండలమునకు చుట్టునూ పంచవర్ణపు ముగ్గులతోను, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆవేదికకు దక్షిణ పార్శ్వమున వుదకపూరిత కలశంబు నుంచి వేదిక నడుమ సర్వవ్యాపకున్దయినా అనంత పద్మనాభస్వామిని దర్భతో ఏర్పరచి అందు ఆవాహనము చేసి.
శ్లో: క్రుత్వాదర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం,
సమన్వితం సప్తఫణై పింగాలాక్షం చతుర్భుజం.
అను శ్లోకము చేత శ్వేత ద్వీపవాసియగు, పిన్గాలాక్షుడగు, సప్తఫణి సాహితున్డగు, శంఖ చక్ర గదా ధరున్డుగాను ధ్యానము చేసి, కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి, ప్రదక్షిణ నమస్కారములు గావించి, పదునాలుగు ముళ్ళు గలిగి కుంకుమతో తడసిన క్రొత్త తోరంబును పద్మనాభ స్వామి సమీపమున వుంచి పూజించి అయిడుపల్ల గోధుమపిండితో ఇరువది ఎనమిది అతిరసములన్ జేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానము ఇచ్చి తక్కిన వానిని తాను భుజిమ్పవలేయును. మరియు పూజాద్రవ్యములన్నియు పడులాలుగేసి వుండవలేయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంతపద్మనాభ స్వామిని ధ్యానించుచు నున్దవలేయును. శీలా! ఇట్లు వ్రతము పరిసమాప్తముచేసి ప్రతి సంవత్సరము వుద్వాసనము చేసి మరల వ్రతము ఆచరిన్చుచున్దవలెను. అని వనితామణులు చెప్పిరి. అంట షీలా తక్షణంబున స్నానం చేసి స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకొని దారి బట్టేమునకుగాను తెచ్చిన సత్తుపిందిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్ట యై, భోజనాడులచే సంత్రుప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు బోయెను.
అంతట శీల అనంత వ్రతం ఆచరించిన మహాత్యమువలన ఆశ్రమము అంతయు స్వర్ణమయముగాను, గృహం అష్ట ఐశ్వర్య యుక్తముగాను ఉండుట చూచి దంపతులు ఇరువురు సంతోష భరితులై సుఖముగానున్దిరి. శీలా-గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములన్ గావించుచుండెను.
అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుంది యుండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల సందితమునుండు తోరముచూచి " కాంతా! నీవు సందియందొక తోరమును గట్టుకొనియున్నావుకదా! అది ఎందులకు కట్టుకొను యున్నావు? నన్ను వశ్యము చేసుకోనుతకా లేక మరియోకరిని వష్యంబు చేసుకోనుతకా అని అడిగెను. అప్పుడు షీలా ఇట్లనియె.
" ప్రాణ నాయకా! అనంతపద్మనాభస్వామి ని ధరించియున్నాను. ఆదేవుని అనుగ్రహంబున వలననే మనకీ ధనదాన్యాది సంపత్తులు గలిగి యున్నవని" తెలిపెను. అప్పుడు కౌదిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి అనంతుదనగా యే దేవుడు అని దూశించుచూ తోరమును త్రెంచి భాభా మండుచుండేది అగ్ని లో పదవేచెను. అంత శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తోరమును తీసుకొని వచ్చి పాలలో తడపి పెట్టెను.
పిదప కొన్ని రోజులకు కౌదిన్యుడు చేసిన ఇట్టి అపరాధమువలన అతని ఐశ్వర్యము అంతయు నశించి గోధనములు దొంగల పాలగును. గృహము అగ్నిపాలయ్యేను. మరియు గృహమునండున్న వస్తువులు ఎక్కడివి అక్కడే నశించెను. ఎవరితో మాట్లాడినాను ఆకారణముగా కలహములు వచ్చుచుండెను.
అంతటా కౌదిన్యుడు ఏమియునుదోచక దారిద్ర్యముచే పీడింప బడుచూ అడవులందు ప్రవేశించి క్షుద్భాదా పీడితుండై అనంతపద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి మహాదేవుడిని యెట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒక చోట పుష్ప ఫల భారితమగు గొప్ప మామిడి చెట్టును చూచి చెట్టుపై ఒక పక్షియైనాను వ్రాలకుండుట చూచి ఆశ్చర్యం కలిగి చెట్టుతో ఇట్లనియె: వ్రుక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచితివా? యని అడుగగా వృక్షము నే నేరుగానని చెప్పెను.
అంత కౌండిన్యుడు మరికొంత దూరముపోయి పచ్చిగాద్దిలో ఇటుఅటు తిరుగుచున్న దూడతో గూడిన ఒక గోవును చూచి, కామధేనువా! అనంతపద్మనాభ స్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభస్వామి ఎవరో నే నేరుగాను అని చెప్పెను.
పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు మత్తు పచ్చికలో నిలుచున్న ఒక వ్రుశాభామును చూచి వ్రుశాభారాజమా! అనంతపద్మనాభ స్వామి ని చూచితివా అని అడిగిన, అనంతపద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అనిచేప్పెను.
పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులు తరంగంబులతో గూదియును కమల కల్హార కుముదోత్ఫలంబుల తోడ గూదియును, హన్సకారండవ చక్రకాడులతో గూదియును, ఒక కొలనునుంది జలంబులు మరియొక కొలనుకి పోరాలుచున్డుతయును చూచి, కమలాకరంబులారా! మీరు అనంత పద్మనాభ స్వామి ని చూచితిరా యని అడిగెను. అందులకు పుష్కరినిలు మే మేరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచుని యుండెను. వాటిని జూచి మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అవి అనంతపద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాదానమిచ్చిరి.
అంతటా కౌదిన్యుడు ఎంతో విచారముతో బాధతో మూర్చబోయి క్రిందపడెను. అప్పుడు భగవంతుని కృప గలిగి వృద్ద బ్రాహ్ణణ రూపదారుడై కౌదిన్యుని చెంతకు వచ్చి " విప్రోత్తమా! ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకపోఎను. అంతటా గృహము నవరత్న మణిగణ ఖచితంబగు దేవాంగనల తోడ గూడియు ఉండుట చూచి ఆశ్చర్యంబు చెంది, సదా గరుడ సేవితున్డుగాను, శంఖ చక్ర ధరున్డుగాను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగారమగ్నున్డై భగవంతుని విధంబుగా ప్రార్ధించెను.
నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభాలాన్చన త్వన్నమ స్మరణా త్పాపమశేషం నఃప్రణశ్యతి, నమోనమస్తే గోవిందా నారాయణా జనార్దనా" యని ఇటుల అనేక విధములుగా స్తోత్రంచేసిణ అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై " విప్రోత్తమా! నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించితిని. నేకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభావించకున్డునటులను, అంత్యకాలమున శాశ్వత విశ్నులోకము గలుగునట్లు వరము ఇచ్చితిని అనెను.
అప్పుడు కొందిన్యుడు ఆనందముతో ఇట్లనెను.
జగన్నాధా! నేను మార్ఘ మధ్యలో చూచిన మామిడి చెట్టు వృత్తాంతము ఏమిటి ? ఆవు ఎక్కడిది? వృషంభు ఎక్కడినుండి వచ్చెను? కొలను విశేషము ఏమిటి? గాడిద ఏనుగు, బ్రాహ్మనులు ఎవరు? అని భగవంతుడిని అడిగెను. అపుడు పరమాత్ముడు.
బ్రాహ్ణణ శ్రేష్టుడా! పూర్వము ఒక బ్రాహ్ణణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను. ఒకడు మహా భాగ్యవంతుడై యుండి తన జీవిత కాలమునందు ఎన్నడును బ్రాహ్ణణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగుచున్నాడు. పూర్వము ఒక రాజు ధనమదాన్దుడై
బ్రాహ్ణణులకు చవితి భూమిని దానము జేసినందున రాజు వ్రుషభంబై అడవిలో తిరుగుచున్నాడు. కొలంకులు రెండును ఒకటి ధర్మమూ, మరియొకటి అధర్మము. ఒక మానవుడు సర్వదా పరులను దూశించుచూ నున్దినందున గాదిదయై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానె విక్రయించి వెనకేసుకోనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుదనైన నేనే బ్రాహ్ణణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని. కావున నీవు వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరిన్చితివేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చెదనని వచించి భగవంతుడు అంతర్దానము నొందేను.
పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంత మంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రాతంబు నాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్రమందలము చేరెను.
ధర్మరాజా! మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునండు కాన బడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని వ్రాతంబు ఆచరించి లోకంబున ప్రసిద్ది పొందెను. సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అంత్యంబున స్వర్గమును బొందిరి. కావున వ్రత కథను సంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులు ననుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుదురు.