Saturday 20 August 2011

శ్రీ కృష్ణాష్టోత్తరం



శ్రీ కృష్ణాష్టోత్తరం


ఇతి శ్రీ కృష్ణాష్టోత్తరం శతనామావళిః పూజాం కరిష్యే


ఓం శ్రీకృష్ణాయ నమః

ఓం కమలా నాధాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం పనాతనాయ నమః

ఓం వసుదేవాత్మజాయ నమః

ఓం పుణ్యాయ నమః

ఓం లీలామానుష విగ్రహాయ నమః

ఓం శ్రీ వత్సకౌస్తుభధరాయ నమః

ఓం యశోదా వత్సలాయ నమః

ఓం హరయే నమః

ఓం చతుర్భుజాత్త చక్రా సిగదా శార్ఙ్ఞాయ నమః

ఓం ద్యుదాయుధాయ నమః

ఓం దేవకీ నందనాయ నమః

ఓం శ్రోశాయ నమః

ఓం నందగోస ప్రియాత్మజాయ నమః

ఓం యమునా వేగ సం హారిణే నమః

ఓం బలభద్ర ప్రియానుజాయ నమః

ఓం పూతనా జీవిత హరాయ నమః

ఓం శకటాసుర భంజనాయ నమః

ఓం నందప్రజ జనానందివే నమః

ఓం సచ్చితానంద విగ్రహయ నమః

ఓం నననీత లిప్తాంగాయ నమః

ఓం నననీత నటాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం నవనీత ననాహారాయ నమః

ఓం ముచికుంద ప్రసాదకాయ నమః

ఓం షోడ శస్త్రీ సహస్రేశాయ నమః

ఓం త్రిభంగినే నమః

ఓం మధురా కృతియే నమః

ఓం శుకవాగ మృతాబ్ధీనందనే నమః

ఓం గోవిందాయ నమః

ఓం యోగినాం పతయే నమః

ఓం వత్సవాట చరాయ నమః

ఓం అన ంతాయ నమః

ఓం ధేనుకాసుర భంజనాయ నమః

ఓం తృణీకృత తృణావర్తాయ నమః

ఓం యమలార్జున భంజనాయ నమః

ఓం ఉత్తాల తాల భేత్రే నమః

ఓం తమాల శ్యామలా కృతయే నమః

ఓం గోప గోపీశ్వరాయ నమః

ఓం యోగినే నమః

ఓం కోటి సూర్య సమప్రభాయ నమః

ఓం ఇలా పతయే నమః

ఓం పరం జ్యోతిషే నమః

ఓం యాద వేంద్రాయ నమః

ఓం యదూద్వహోయ నమః

ఓం వనమాలినే నమః

ఓం పీతవాసినే నమః

ఓం పారిజాతాపహోరకాయ నమః

ఓం గోవర్ధనాచలోద్ధర్త్తే నమః

ఓం గోపాలాయ నమః

ఓం సర్వపాలకాయ నమః

ఓం ఆజాయ నమః

ఓం నిరంజనాయ నమః

ఓం కామజనకాయ నమః

ఓం కంజలోచనాయ నమః

ఓం మధు నమః

ఓం మధురానాధాయ నమః

ఓం ద్వారకానాయకాయ నమః

ఓం బలినే నమః

ఓం బృందావనాంత సంచారిణే నమః

ఓం తులసీదామ భూషణాయ నమః

ఓం శ్యమంతక మణీర్హర్త్రే నమః

ఓం నరనారాయణ కృతయే నమః

ఓం కుజ్జా కృషాం బరధరాయ నమః

ఓం వరాయినే నమః

ఓం పరమ పురుషాయ నమః

ఓం ముష్టికాసుర బాణూరమల్ల నమః

ఓం యుద్ధ విశారదాయ నమః

ఓం సంసార వ్తెరిణే నమః

ఓం కంసారయే నమః

ఓం మూరారయే నమః

ఓం నరకాస్తకాయ నమః

ఓం అనాదిబ్రహ్మచారిణే నమః

ఓం కృష్ణా వ్యసన కర్మకాయ నమః

ఓం సత్యవాచే నమః

ఓం సత్య సంకల్పాయ నమః

ఓం సత్యభామారతాయ నమః

ఓం జయినే నమః

ఓం సుభద్రా పూర్వజాయ నమః

ఓం విష్ణవే నమః

ఓం భీష్మ ముక్తి ప్రదాయకాయ నమః

ఓం జగద్గురవే నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం వేణునాద విశారదాయ నమః

ఓం వృషభాసుర విధ్వంసినే నమః

ఓం బాణాసుర కరాంతకాయ నమః

ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః

ఓం బర్హి బ వసంతకాయ నమః

ఓం పార్ధ పారధయే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం గీతామృత మహోవధయే నమః

ఓం కాలాయ ఫణిమాణిక్యరంజిత నమః

ఓం శ్రీ పదాం ఋజాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం యజ్ఞభోక్త్రే నమః

ఓం దానవేంద్ర వినాశకాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః

ఓం పన్నగాశన వాహనాయ నమః

ఓం జలక్రీడా సమాసక్త గోపివస్త్రా పహరకాయ నమః

ఓం పుణ్యశ్లోకాయ నమః

ఓం తీర్ధపాదాయ నమః

ఓం వేదవేద్యాయ నమః

ఓం దయానిధయే నమః

ఓం సర్వతీర్ధాత్మకాయ నమః

ఓం సర్వగ్రహరూపిణే నమః

ఓం పరాత్పరాయ నమః

ఇతి శ్రీ కృష్ణాష్టోత్తరం శతనామావళిః పూజాం సమాప్తం 

Saturday 13 August 2011

శ్లోకములు

01 కర దర్శన శ్లోకం

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి
కరమూలేతుస్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం

02 భూదేవి శ్లోకం

సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

03 సుప్రభాతం


04 స్నానం చేయునపుడు పఠించవలసిన శ్లోకం

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

05 సూర్య నమస్కారం

ఆది దేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
ప్రభాకర నమస్తుభ్యం దివాకర నమోన్నమః


ఆదిత్య హృదయం

రష్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువదీశ్వరం
సర్వ దేవాత్మకో హ్యేష తేజస్వీ రష్మి భావనః
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతు గభస్తిభిః
ఏష బ్రహ్మష్చ విష్ణుశ్చ శివస్స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యంపతిః
పితరో వసవస్సాధ్యా హ్యశివ్వ్ మరుతో మనుః
వాయుర్వ్హహ్నిః ప్రజాపాణా ఋతుకరా ప్రభాకరః
ఆదిత్య స్సవితా సుర్యః ఖగః పూషా గభస్తిమాన్
వర్ణ సుధృశో భానుః హిరణ్యరేతా దివాకరః
హరి దశ్వస్యహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్
తిమిరో న్మధనశ్శంభుః త్వషటా మార్తాండ అంశుమాన్
హిరణ్యగర్భశ్శిశిరః తపనో భాస్కరో రవిః
అగ్ని గర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః
మనాధం స్తమోభేదీ ఋగ్య జుస్సామ పారగః
ఘనదృష్టి రపాం మిత్రో వింధ్య వీధీప్లవంగమః
అతపీ మండలీ మృత్యుః పింగళస్సర్వ తాపనః
కవిర్విశ్యో మహాతేజాః రక్త స్సర్వ భవోద్భవః
నక్షత్ర గ్రహ తారణా మధిపో విశ్వభావనః
తేజస్వామపి తేజస్వీ ద్వాదశాత్మన్న మోంస్తుతే
నమః పుర్యాయ గిరయే పశ్చిమాగ్రరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః
జయాయ జయ భద్రాయ హర్యశ్యాయ నమోన్నమః
నమో సమస్సహస్రాంశో ఆదిత్యాయ నమోన్నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోన్నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోన్నమః
బ్రహ్మేశానాచ్యుతేశాయ సుర్యాయాదిత్య వర్ఛసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషేనమః
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామి తాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే న్నమః
తప్త చామీక రాభాయ యే విశ్వకర్మణే
నమః స్తమోభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే
నాశయత్యేష వ్తెభూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేషః వర్షత్యేష గభస్తిభిః
ఏష సుస్తేఘ జాగర్తి భూతేఘ పరినిష్ఠితః
ఏష చ్తెవాగ్ని హోత్రంచ ఫలం చ్తెవాగ్ని హోత్రిణాం
వేదాశ్చ క్రత వశ్త్చేవ క్రతూనాం ఫలమేవచ
యాని కృత్యాని లోకేఘ సర్వఏఘ పరమ ప్రభుః



06 తిలక ధారణ శ్లోకం
07 దీపారాధన శ్లోకం

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే

08 ధూప మంత్రం

09 ఓం కారం మూడు సార్లు

10గురుధ్యానము

గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేన్నమః

11 ఘంటానాదం

ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రక్షసాం
కుర్యాద్ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం

12 సంకల్పము

ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివికమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓంహృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షనాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓంఅధోక్షజాయ నమః
ఓం నృసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః

13 విఘ్నేశ్వర ధ్యానం

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానా మేకదంత ముపాస్మహే

14 ఆంజనేయ ప్రార్ధన

మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుదిమతాం వాతాత్మజం
వానర యూధ ముఖ్యం
శ్రీ రామ దూతం శిరసానమామి

ఆంజనేయ మది పాడలావనం
కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూల వాసినం
భావయామి భవమాన నందనం

యత్ర యత్ర రఘనాధ కీర్తనం
తత్ర తత్ర కృతమస్త కాంజలీం
భాష్ప వారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం

15 బ్రహ్మ ధ్యానం

ఓం నమస్తే సతే సర్వ లోకాశ్రయాయ
నమస్తేతే చితే విశ్వరూపాత్మకాయ
నమో ద్త్వెత తత్తావయ ముక్తి ప్రదాయ
నమో బ్రాహ్మణే వ్యాపినే నిర్గుణాయ

16 సరస్వతి ప్రార్దన

సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి
విదారంభం కరిష్యామి సిధిర్భవతు మే సదా
పద్మా పత్ర విశాలక్షీ పద్మకేసర వర్ణినీ
నిత్యం పద్మాలయాం దేవి సామూం పాతు సరస్వతి

17 విష్ణు స్తోత్రం

శాంతాకారం భుజగశయనం పద్మానాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానవనం
వందే విఘ్ణం భవ భయ హరం సర్వలోక్తెక నాధం

18 లక్ష్మి స్తోత్రం

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్త్రేలోక్య కుటూంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

19 శివ స్తోత్రం

వందే శంభు ముమాపతిం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భుషణం మృగధరం వందే పశునాం పతి
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం

20 పార్వతి స్తోత్రం

ఓంకార పంజర శుకీం ఉపనిష దుద్యాన కేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం

21 కృష్ణ స్తోత్రం

వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

22 నరసింహ స్తోత్రం

ఉగ్రం వీరం మహా విఘ్ణం జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం

23 రామ స్తోత్రం

శ్రీరాఘవం దశరాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘకులాన్వయ రత్నదీపం
ఆజాను బాహుం అరవింద దళాయ తాక్షం
రామం నిశాచరం వినాశకరం నమామి

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే

24 గాయత్రి మంత్రం

ఓం భూర్భువస్సుః తత్సవితర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహీ దియోయోనః ప్రచోదయత్

25 నవగ్రహ ధ్యానం

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః

అసతోమా సద్గమయ తమ సోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగ మాయ ఓం శాంతిః శాంతిః శాంతిః

26 ప్రాణామాయ మంత్రం

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం గ్ ం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దియోయోనః ప్రచోదయత్ ఓం మాపో జ్యోతిరసోన్ మృత బ్రహ్మ భూర్భువస్సువరోం నమో నారాయణాయ

27 మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజా మహే
సుగంధిం పుష్ఠివర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్మృక్షీయ మామృతాత్
 

వరలక్ష్మి వ్రతము

వరలక్ష్మి వ్రతము

 
ఓం వరలక్ష్మ్యై నమః

గణపతిపూజ 

ఓం శ్రిగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్, 
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!  సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|  అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||  యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||  
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|  తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|  పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|  ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|  లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||  సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|  శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే|| 

శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః|  ఉమా మహేశ్వరాభ్యాం  నమః|  వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః|  అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః|  సర్వేభ్యోమహాజనేభ్యో నమః|  

ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః,  మాధవాయ స్వాహాః  
  

 గోవిందాయ నమః,  విష్ణవే నమః,  మధుసూదనాయ నమః,  త్రివిక్రమాయ నమః,  వామనాయ నమః,  శ్రీధరాయ నమః,  హృషీకేశాయ  నమః,  పద్మనాభాయ నమః,  దామోదరాయ నమః,  సంకర్షణాయ నమః,  వాసుదేవాయ నమః,  ప్రద్యుమ్నాయ నమః,  అనిరుద్దాయ నమః, 

  
పురుషోత్తమాయ నమః,  అధోక్షజాయ నమః,  ,నారసింహాయ నమః,  అచ్యుతాయ నమః,  ఉపేంద్రాయ నమః,  హరయే నమః,  శ్రీ కృష్ణాయ నమః,  శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామము: 
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః,   ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.
 ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.  మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య  శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే,  ....... మాసే, .......పక్షే  ,......తిది, ,,,,,,,,వాసరే  శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం,  శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం,  పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం,  సర్వాభీష్ట సిద్ధ్యర్థం,  మహా గణాధిపతి  ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
కలశారాధన: 
(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).

శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః

మం: ఆ కలశే 

శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
 

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః

కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)
మం: ఓం అసునీతే 
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు | 
మం: ఓం గణానాం
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి.  ఆవాహయామి ఆసనం సమర్పయామి |  పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి |  శుద్ధ ఆచమనీయం సమర్పయామి |  
మం: ఆపోహిస్తామ 
శ్రీ మహాగణాదిపతయే నమః | శుద్దోదక స్నానం సమరపయామి.  స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి | 
మం:  అభివస్త్రా 
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి | 
మం: యజ్ఞోపవీతం 
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి | 
మం: గంధద్వారాం 
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి | 
మం: ఆయనేతే 
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |
అధఃపుష్పైపూజయామి. 
ఓం సుముఖాయనమః 
ఓం ఏకదంతాయనమః 
ఓం కపిలాయనమః 
ఓం గజకర్నికాయనమః 
ఓం లంభోదరయానమః 
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః 
ఓం గానాదిపాయనమః 
ఓం దూమ్రకేతవే నమః 
ఓం గణాధ్యక్షాయ నమః 
ఓం ఫాలచంద్రాయనమః 
ఓం గజాననాయనమః 
ఓం వక్రతుండాయ నమః 
ఓం శూర్పకర్ణాయ నమః 
ఓం హీరంభాయ నమః 
ఓం స్కందాగ్రజాయ నమః 
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః 
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.  
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం | ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం ||  ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.  
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం | భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె  ||  ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి || 
నైవేద్యం: ఓం భోర్భు  
శ్లో:  నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి.  ఓం ప్రానాయస్వాహా   
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి || ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం | ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి | మం: హిరణ్యపాత్రం
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం || 
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః ||  షోడశైతాని  నామాని యఃపఠే చ్రునుయాదపి |  విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే |  ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి | 
శ్లో:  యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి || 
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు  |  న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు |  ఉత్తరే శుభకర్మణ్య  విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన 
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

వరలక్ష్మి వ్రతము (varalaxmi vrathamu)
ప్రాణ ప్రతిష్ట:
ఓం అసునీతే హి స్వామినీ, సర్వ జగన్నాయకే యావత్పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ చేత్రేస్మిన్ సంనిన్దిమ్కురు.  ఆవాహితోభవ, స్తాపితోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ స్తిరాసనం కురు, ( అని పుష్పాక్షితలు కలశముపై చిత్రపతముపై వేయవలెను)
అధధ్యానం:
శ్లో: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే | 
నారాయణప్రియే దేవి సుప్రీతా భావ సర్వదా || 
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే | 
సుస్తిరా భావమే గేహే సురాసుర నమస్కృతే || 
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ధ్యానం సమర్పయామి.

శ్లో: సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే  | 
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భావ సర్వదా||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మావాహయామి.

శ్లో: సుర్యాయుత విభాస్పూర్తే స్ఫురద్రత్న విభూషితే| 
సింహాసనమిదం దేవీ గృహ్యాతాం సమర్పయామి||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

శ్లో:  శుద్దోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం| 
అర్ఘ్యం దాస్యామితే దేవి గృహ్యాతాం హరివల్లభే|| 
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి.

శ్లో:  సువాసిత జలం రమ్యం సర్వతీర్ధం సముద్భవం|
పాద్యం గృహాన దేవి త్వం సర్వదేవ నమస్కృతే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పాద్యం సమర్పయామి.

శ్లో:  సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం| 
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభాప్రదే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ఆచమనీయం సమర్పయామి.

శ్లో:  పయోధది ఘ్రుతోపెతం శర్కరా మధుసంయుతం|
పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి.

శ్లో:  గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం|
శుద్దోదక స్నాన మిదం గృహాన పరమేశ్వరి||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః శుద్దోదక స్నానం సర్పయామి.

శ్లో:  సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే|
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

శ్లో:  కేయూర కంకణాదేవి హర నూపుర మేఖలా|
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ఆభరణాన్ సమర్పయామి. 

శ్లో: తప్త హేమక్రుతం దేవి మాంగళ్యం మంగళప్రదం |
మయాసమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదం||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మాంగళ్యం సమర్పయామి.

శ్లో: కర్పూరాగారు కస్తూరిరోచనాది సుసంయుతం|
గంధం దాస్యామి తే దేవి స్వీకురుష్వ శుభప్రదే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః గంధం సమర్పయామి.

శ్లో:  అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్|
హరిద్రా కుంకుమోపేతాన్ స్వీకురుష్వాబ్దిపుత్రికే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

శ్లో: మల్లికా జాజి కుసుమై శ్చమ్పక ర్వకులైరపి|
శాతపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పుష్పాణి సమర్పయామి.
అధాంగ పూజ :
చంచలాయై నమః     -    పాదౌ పూజయామి 
చపలాయై నమః       -    జానునీ పూజయామి
పీతాంబరాయై నమః  -     ఊరూంపూజయామి 
కమలవాసిన్యై నమః  -     కటిం పూజయామి 
పద్మాలయాయై నమః -   నాభిం పూజయామి 
మదనమాత్రే నమః    -    స్థనౌ పూజయామి 
కంభుకంట్యై నమః     -    కంటం పూజయామి 
సుముఖాయై నమః   -    ముఖం పూజయామి 
సునేత్రాయై నమః     -      నేత్రౌ పూజయామి 
రమాయి నమః       -   కర్ణౌ పూజయామి 
కమలాయై నమః      -    శిరః పూజయామి 
శ్రీ వరలక్ష్మై నమః     -       సర్వాణ్యంగాని పూజయామి 

వరలక్ష్మి అష్టోత్తర  శతనామావళి
ఓం  ప్రకృత్యై  నమః
ఓం  వికృత్యై  నమః
ఓం  విద్యాయై  నమః
ఓం  సర్వభూతహితప్రదాయై  నమః
ఓం  శ్రద్ధాయై  నమః
ఓం  విభుత్యై   నమః
ఓం  సురభ్యై  నమః
ఓం  పరమాత్మికాయై  నమః
ఓం  వాచ్యై  నమః
ఓం  పద్మాలయాయై  నమః
ఓం  పద్మాయై  నమః
ఓం  శుచయే  నమః
ఓం  స్వాహాయై  నమః
ఓం  స్వధాయై  నమః
ఓం  సుధాయై  నమః
ఓం  ధన్యాయై  నమః
ఓం  హిరణ్మయ్యై  నమః
ఓం  లక్ష్మి నమః
ఓం  నిత్యపుష్టాయై   నమః
ఓం  విభావర్యై  నమః
ఓం  ఆదిత్యై  నమః
ఓం  దిత్యే  నమః
ఓం  దీప్తాయై   నమః
ఓం  వసుధాయై  నమః
ఓం  వాసుదారిన్యై  నమః
ఓం  కమలాయై  నమః
ఓం  కాంతాయై  నమః
ఓం  కామాక్షై  నమః
ఓం  క్రోధసంభవాయై  నమః
ఓం  అనుగ్రహప్రదాయై  నమః
ఓం  బుద్ధయే  నమః
ఓం  అనఘాయై  నమః
ఓం  హరివల్లభాయై  నమః
ఓం  అశోకాయై  నమః
ఓం  అమృతాయై   నమః
ఓం  దీప్తాయై   నమః
ఓం  లోకశోకవినాశిన్యై  నమః
ఓం  ధర్మనిలయాయై  నమః
ఓం  కరుణాయై  నమః
ఓం  లోకమాత్రే  నమః
ఓం  పద్మప్రియాయై  నమః
ఓం  పద్మహస్తాయై  నమః
ఓం  పద్మాక్షై  నమః
ఓం  పద్మసుందర్యై  నమః
ఓం  పద్మోద్భవాయై  నమః
ఓం  పద్మముఖ్యై  నమః
ఓం  పద్మనాభప్రియాయై  నమః
ఓం  రమాయై  నమః
ఓం  పద్మమాలాధరాయై  నమః
ఓం  దేవ్యై  నమః
ఓం  పద్మిన్యై  నమః
ఓం  పద్మగంధిన్యై  నమః
ఓం  పుణ్యగంధాయై  నమః
ఓం  సుప్రసన్నాయై  నమః
ఓం  ప్రసాదాభిముఖ్యై  నమః
ఓం  ప్రభాయై  నమః
ఓం  చంద్రవదనాయై  నమః
ఓం  చంద్రాయై  నమః
ఓం  చంద్రసహోదర్యై  నమః
ఓం  చతుర్భుజాయై  నమః
ఓం  ఛన్ద్రరూపాయై  నమః
ఓం  ఇందిరాయై  నమః
ఓం  ఇందుశీతలాయై   నమః
ఓం  ఆహ్లాదజనన్యై  నమః
ఓం  పుష్ట్యై   నమః
ఓం  శివాయై  నమః
ఓం  శివకర్యై  నమః
ఓం  సత్యై  నమః
ఓం  విమలాయై  నమః
ఓం  విశ్వజనన్యై  నమః
ఓం  తుష్టయై   నమః
ఓం  దారిద్ర్యనాశిన్యై  నమః
ఓం  ప్రీతిపుష్కరిన్యై   నమః
ఓం  శాంతాయై  నమః
ఓం  శుక్లమాల్యాంబరాయై   నమః
ఓం  శ్రియై  నమః
ఓం  భాస్కర్యై  నమః
ఓం  బిల్వనిలయాయై  నమః
ఓం  వరారోహాయై  నమః
ఓం  యశస్విన్యై  నమః
ఓం  వసుంధరాయై  నమః
ఓం  ఉదరాంగాయై   నమః
ఓం  హరిణ్యై  నమః
ఓం  హేమమాలిన్యై  నమః
ఓం  ధనదాన్యకర్యే  నమః
ఓం  సిద్ధయే  నమః
ఓం  త్రైనసౌమ్యాయై   నమః
ఓం  శుభప్రదాయే  నమః
ఓం  నృపవేష్మగతానందాయై  నమః
ఓం  వరలక్ష్మి నమః
ఓం  వసుప్రదాయై  నమః
ఓం  శుభాయై  నమః
ఓం  హిరణ్యప్రాకారాయై  నమః
ఓం  సముద్రతనయాయై  నమః
ఓం  జయాయై  నమః
ఓం  మంగళాదేవ్యై  నమః
ఓం  విష్ణు వక్షస్థలాయై      నమః
ఓం  విష్ణుపత్న్యై   నమః
ఓం  ప్రసన్నాక్ష్యై   నమః
ఓం  నారాయనసమాశ్రితాయై  నమః
ఓం  దారిద్రద్వంసిన్యై   నమః
ఓం  దేవ్యై  నమః
ఓం  సర్వోపద్రవ నివారిన్యై  నమః
ఓం  నవదుర్గాయై  నమః
ఓం  మహాకాళ్యై  నమః
ఓం  బ్రహ్మావిష్ణుశివాత్మికాయై  నమః
ఓం  త్రికాలజ్ఞానసంపన్నాయై   నమః
ఓం  భువనేశ్వర్య  నమః 
ఓం శ్రీ వరలక్ష్మై నమః 





శ్లో: దశాంగం గగ్గులోపెతం సుగంధిం సుమనోహరం |
ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మి గృహానతం  ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః దూపమాఘ్రాపయామి.

శ్లో:  ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం | 
దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితాభవ || 
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః దీపం దర్శయామి.

శ్లో:  నైవేద్యం షడ్రసోపేతం దదిమాద్వాజ్య సంయుతం|
నానాభాక్ష్య ఫలోపెతం గృహాణ హరివల్లభే || 
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

శ్లో: ఫూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం | 
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం || 
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః తాంబూలం సమర్పయామి.

శ్లో:  నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం | 
తుభ్యం దాస్యామహం దేవీ గృహ్యాతాం విశ్నువల్లభే ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నీరాజనం సమర్పయామి.

శ్లో: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే | 
నారాయనప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.

శ్లో:  యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ |
త్రాహిమాం క్రుపయాదేవి శరణాగతవత్సలా   || 
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్షజనార్ధన || 
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నమస్కారాన్ సమర్పయామి.  

తోరపూజ: ( తోరమును అమ్మవారివడ్డ వుంచి అక్షతలతో ఈ క్రింది విధముగా పూజింపవలెయును  ) 
కమలాయై నమః                   ప్రధమగ్రందిం పూజయామి 
రమాయి నమః                     ద్వితీయగ్రందిం పూజయామి
లోకమాత్రేనమః                     త్రుతీయగ్రందిం పూజయామి 
విశ్వజనైన్య నమః                  చతుర్ధగ్రందిం పూజయామి
వరలక్ష్మైనమః                       పంచామగ్రందిం పూజయామి
క్షీరాబ్దితనయాయ నమః          షష్ఠమగ్రందిం  పూజయామి 
విశ్వసాక్షినై నమః                   సప్తమగ్రందిం పూజయామి 
చంద్రసహోదరై నమః             అష్టమగ్రంధిం పూజయామి 
వరలక్ష్మై నమః                      నవమగ్రందిం పూజయామి.

ఈ క్రింది శ్లోకమును చదువుతూ తోరమును కుడిచేతికి కట్టుకోవలెను.
శ్లో:  బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం | 
పుత్రపౌత్రాభి వృద్దించ సౌభాగ్యం దేహిమే రమే ||

వాయన దానము:  వాయనమిచ్చునప్పుడు ఈ క్రింది శ్లోకమును చదువుతూ వాయనము ఇవ్వవలెను.  
వాయనము అనగా: ముత్తైదువులకు పసుపు కుంకుమ, రవికె, పండ్లు, దక్షిణ, పుస్తకము పళ్ళెంలో పెట్టి దానము ఇవ్వవలెను.
శ్లో:  ఇందిరా ప్రతిగృహ్నాతు  ఇందిరా వై దదాతి చ |
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమోనమః ||
ఈ శ్లోకముతో వాయనము ఇచ్చి అక్షతలు పుచ్చుకొని వ్రాతకతను చదువుకోవలెను.

వరలక్ష్మీ వ్రత- కథ
 

 

 

 
                  సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. 'ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి'.
 

                ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి' అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. 'ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను'.
 

                 పార్వతీదేవి ' నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి' అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.
 

                ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో  శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను' అలా ప్రత్యక్షమైన అమ్మ వారని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
 
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయే శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే
 
అని అనేక విధములు స్తోత్రం చేసింది.
 

                   'ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది'. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.  ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.
 

                వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.
 

                          చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.

                          పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా
 

                    అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేసారు. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.
 
దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.
 
చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.
 

                  వారు దోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.
 
అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును' అన్నాడు పరమశివుడు.
 

                సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అన్నారు.
 

                        వరలక్ష్మీ వ్రత కల్పము సమాప్తము.
 

                        కథాక్షతలు అమ్మవారి మీద వేసి, మీ మీద వేసుకోండి.

వినాయక వ్రత పూజా విధానం

 వినాయక వ్రత పూజా విధానం

ఓం గణేశాయ నమః


 ఆచమనం:  ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః,  మాధవాయ స్వాహాః  (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః,  విష్ణవే నమః,  మధుసూదనాయ నమః,  త్రివిక్రమాయ నమః,  వామనాయ నమః,  శ్రీధరాయ నమః,  హృషీకేశాయ నమః,  పద్మనాభాయ నమః,  దామోదరాయ నమః,  సంకర్షణాయ నమః,  వాసుదేవాయ నమః,  ప్రద్యుమ్నాయ నమః,  అనిరుద్దాయ నమః

పురుషోత్తమాయ నమః,  అధోక్షజాయ నమః,  ,నారసింహాయ నమః,  అచ్యుతాయ నమః,  ఉపేంద్రాయ నమః,  హరయే నమః,  శ్రీ కృష్ణాయ నమః,  శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

 ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః
శ్రీ గోవింద గోవింద
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః,   ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ప్రాణాయామము  చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య  శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే,  ....... మాసే, .......పక్షే  ,......తిది, ,,,,,,,,వాసరే  శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం,  శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం,  పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం,  సర్వాభీష్ట సిద్ధ్యర్థం,  సిద్ది విణాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
              కలసస్య ముఖే విష్ణుః కంటే రుద్రసమాశ్రితః, మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతః కుక్షౌత్సాగరాసర్వేసప్త ద్వీపా వసుంధర, ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వనః అన్గైస్చ సాహితాసర్వే కలశాంబు సమాశ్రితః.
ఆకలశే
శ్లో:  గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి 
      నర్మదే సొందు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు|| 
      కావేరి తున్గాభాద్రాచ క్రుష్ణవేన్యాచ గౌతమీ|
      భాగీరదీచ ప్రఖ్యాతాః పంచాగంగాః ప్రకీర్తితితః 
ఆయాంటూ దేవపూజార్ధం మమ (యజమానస్య) దురితక్షయకారకాః కలశోధకేన పూజా ద్రవ్యాని సంప్రోక్షయః.  (కలశాములోని నీళ్ళను పూజా ద్రవ్యములపైన, దేవునిపైన, తమ శిరస్సుపైన కొద్దిగా చల్లుకోవాలి)
అసునీతే 

ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥

                                                    శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
                                                                                                    శ్రీ మహా గణాధిపతయే నమః    ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥
                                                     శ్రీ మహా గణాధిపతయే నమః  ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥
                                                           శ్రీ మహా గణాధిపతయే నమః ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
                                                            శ్రీ మహా గణాధిపతయే నమః  పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥
                                                                     ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥
                                                                      మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥
                                                                 పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥
                                                                   శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥
                                                                        వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥
                                                                            ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥
                                                                             గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
                                                                             అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
                                                                              పుష్పాణి పూజయామి.

అథాంగ పూజ

(పుష్పములతో పూజించవలెను)
గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ

(21 విధముల పత్రములతో  పూజింపవలెను)
సుముఖాయనమః -మాచీపత్రం  పూజయామి।  గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।  ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।  గజాననాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి|  హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి। లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।  గుహాగ్రజాయనమః -అపామార్గపత్రం పూజయామి।  గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి|  ఏకదంతాయ నమః - చూతపత్రం   పూజయామి|  వికటాయ నమః -కరవీరపత్రం పూజయామి।  భిన్నదంతాయ నమః -విష్ణుక్రాంతపత్రం  పూజయామి|  వటవేనమః - దాడిమీపత్రం పూజయామి|  సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి|  ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి|  హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి|  శూర్పకర్ణాయనమః -జాజీపత్రం పూజయామి|  సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి|  ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి|  వినాయకాయ నమః -అశ్వద్దపత్రం పూజయామి|  సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।  కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।  
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

 శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా

                 ఓం గజాననాయ నమః
    ఓం గణాధ్యక్షాయ నమః
    ఓం విఘ్నరాజాయ నమః
    ఓం వినాయకాయ నమః
    ఓం ద్వైమాతురాయ నమః
    ఓం ద్విముఖాయ నమః
    ఓం ప్రముఖాయ నమః
    ఓం సుముఖాయ నమః
    ఓం కృతినే నమః
    ఓం సుప్రదీప్తాయ నమః
    ఓం సుఖనిధయే నమః
    ఓం సురాధ్యక్షాయ నమః
    ఓం సురారిఘ్నాయ నమః
    ఓం మహాగణపతయే నమః
    ఓం మాన్యాయ నమః
    ఓం మహాకాలాయ నమః
    ఓం మహాబలాయ నమః
    ఓం హేరంబాయ నమః
    ఓం లంబజఠరాయ నమః
    ఓం హయగ్రీవాయ నమః
    ఓం ప్రథమాయ నమః
    ఓం ప్రాజ్ఞాయ నమః
    ఓం ప్రమోదాయ నమః
    ఓం మోదకప్రియాయ నమః
    ఓం విఘ్నకర్త్రే నమః
    ఓం విఘ్నహంత్రే నమః
    ఓం విశ్వనేత్రే నమః
    ఓం విరాట్పతయే నమః
    ఓం శ్రీపతయే నమః
    ఓం వాక్పతయే నమః
    ఓం శృంగారిణే నమః
    ఓం ఆశ్రితవత్సలాయ నమః
    ఓం శివప్రియాయ నమః
    ఓం శీఘ్రకారిణే నమః
    ఓం శాశ్వతాయ నమః
    ఓం బల్వాన్వితాయ నమః
    ఓం బలోద్దతాయ నమః
    ఓం భక్తనిధయే నమః
    ఓం భావగమ్యాయ నమః
    ఓం భావాత్మజాయ నమః
    ఓం అగ్రగామినే నమః
    ఓం మంత్రకృతే నమః
    ఓం చామీకర ప్రభాయ నమః
    ఓం సర్వాయ నమః
    ఓం సర్వోపాస్యాయ నమః
    ఓం సర్వకర్త్రే నమః
    ఓం సర్వ నేత్రే నమః
    ఓం నర్వసిద్దిప్రదాయ నమః
    ఓం పంచహస్తాయ నమః
    ఓం పార్వతీనందనాయ నమః
    ఓం ప్రభవే నమః
    ఓం కుమార గురవే నమః
    ఓం కుంజరాసురభంజనాయ నమః
    ఓం కాంతిమతే నమః
    ఓం ధృతిమతే నమః
    ఓం కామినే నమః
    ఓం కపిత్థఫలప్రియాయ నమః
    ఓం బ్రహ్మచారిణే నమః
    ఓం బ్రహ్మరూపిణే నమః
    ఓం మహోదరాయ నమః
    ఓం మదోత్కటాయ నమః
    ఓం మహావీరాయ నమః
    ఓం మంత్రిణే నమః
    ఓం మంగళసుస్వరాయ నమః
    ఓం ప్రమదాయ నమః
    ఓం జ్యాయసే నమః
    ఓం యక్షికిన్నరసేవితాయ నమః
    ఓం గంగాసుతాయ నమః
    ఓం గణాధీశాయ నమః
    ఓం గంభీరనినదాయ నమః
    ఓం వటవే నమః
    ఓం జ్యోతిషే నమః
    ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
    ఓం అభీష్టవరదాయ నమః
    ఓం మంగళప్రదాయ నమః
    ఓం అవ్యక్త రూపాయ నమః
    ఓం పురాణపురుషాయ నమః
    ఓం పూష్ణే నమః
    ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః 
    ఓం అగ్రగణ్యాయ నమః
    ఓం అగ్రపూజ్యాయ నమః
    ఓం అపాకృతపరాక్రమాయ నమః
    ఓం సత్యధర్మిణే నమః
    ఓం సఖ్యై నమః
    ఓం సారాయ నమః
    ఓం సరసాంబునిధయే నమః
    ఓం మహేశాయ నమః
    ఓం విశదాంగాయ నమః
    ఓం మణికింకిణీ మేఖలాయ నమః
    ఓం సమస్తదేవతామూర్తయే నమః
    ఓం సహిష్ణవే నమః
    ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
    ఓం విష్ణువే నమః
    ఓం విష్ణుప్రియాయ నమః
    ఓం భక్తజీవితాయ నమః
    ఓం ఐశ్వర్యకారణాయ నమః
    ఓం సతతోత్థితాయ నమః
    ఓం విష్వగ్దృశేనమః
    ఓం విశ్వరక్షావిధానకృతే నమః
    ఓం కళ్యాణగురవే నమః
    ఓం ఉన్మత్తవేషాయ నమః
    ఓం పరజయినే నమః
    ఓం సమస్త జగదాధారాయ నమః
    ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
    ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 
    దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥
                                                                                                       ధూపమాఘ్రాపయామి॥
    సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
                                                                                                      దీపందర్శయామి।
    సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,
    భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,
                                                                                    నైవేద్యం సమర్పయామి।
    సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
                                                                          సువర్ణపుష్పం సమర్పయామి.
    పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం
                                                                           తాంబూలం సమర్పయామి।
    ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
                                                                            నీరాజనం సమర్పయామి।

    అథ దూర్వాయుగ్మ పూజా

    గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।
    ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
    కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।


    ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,
                                                            ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,
    అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,
                                                             పునరర్ఘ్యం సమర్పయామి,
    ఓం బ్రహ్మవినాయకాయ నమః
    నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
    ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
    వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
    నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

     శ్రీ వినాయక వ్రత కథ

    గణపతి జననము:

                           సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।
                           భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।
                           అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।
                            శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।
    జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:

    గణేశుడు అగ్రపూజనీయుడు:

                             ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు। వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

    చంద్రుని పరిహాసం:

                             గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।
                             (చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।
                            చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.
    ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.

    శ్యమంతకోపాఖ్యానము:

                               చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.
                               అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది.
                               నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.  ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.
                               అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించినది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలికకున్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఓక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.
                               అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించినాడు.
                               అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్దమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్దము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.
                              శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
                              వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.
                              పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః
                               సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
    వినాయక చవితి పద్యములు
    ప్రార్థన :
    తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
    మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
    కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
    యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.
    తలచెదనే గణనాథుని
    తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
    దలచెదనే హేరంబుని
    దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌
    అటుకులు కొబ్బరి పలుకులు
    చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
    నిటలాక్షు నగ్రసుతునకు
    బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

    వినాయక మంగళాచరణము:

    ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
    కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

    వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
    మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

    శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
    సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం

    ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
    బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

    చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
    పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం